Brahmanandam : ఉప్పల్ స్టేడియంలో గచ్చిబౌలి దివాకర్.. వైరల్ అవుతున్న బ్రహ్మి ఫోటోలు..

ఉప్పల్ స్టేడియంలో గచ్చిబౌలి దివాకర్. మనవడుతో స్టేడియంలో మ్యాచ్ ఎంజాయ్ చేసిన బ్రహ్మి.

Brahmanandam : ఉప్పల్ స్టేడియంలో గచ్చిబౌలి దివాకర్.. వైరల్ అవుతున్న బ్రహ్మి ఫోటోలు..

Brahmanandam photos at CSK SRH match gone viral

Brahmanandam : నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా CSK అండ్ SRH మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఒకటి హోమ్ టీం కావడం, మరొకటి పొరుగు రాష్ట్రం టీం కావడంతో.. మ్యాచ్ చూసేందుకు సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉప్పల్ స్టేడియంకి హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, విక్టరీ వెంకటేష్, కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తదితరులు స్టేడియంలో సందడి చేసారు.

అయితే ఈ సెలబ్రేటిస్ అందరిలో బ్రహ్మి పైనే తెలుగు యువత దృష్టి అంతా ఉంది. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాలో బ్రహ్మానందం క్రికెట్ వీరాభిమానిగా గచ్చిబౌలి దివాకర్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఏదైనా క్రికెట్ మ్యాచ్ జరిగిన ప్రతిసారి.. సోషల్ మీడియాలో ఈ గచ్చిబౌలి దివాకర్ తో మీమ్స్ కనిపిస్తాయి. అలాంటిది గచ్చిబౌలి దివాకరే స్టేడియంలో కనిపిస్తే.. తెలుగు యువతలో మరింత జోష్ కనిపిస్తుంది.

Also read : Tillu Square : టిల్లు గాడి సక్సెస్ ని సెలబ్రేట్ చేయడం కోసం వస్తున్న టోనీ.. అట్లుంటది ఎన్టీఆర్‌తోని..

నిన్న ఉప్పల్ స్టేడియంలో అదే కనిపించింది. స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు బ్రహ్మానందం తన కొడుకు, మనవడుతో కలిసి వచ్చారు. స్టేడియంలో మనవడుతో బ్రహ్మి దిగిన ఫోటోని కొడుకు రాజా గౌతమ్ షేర్ చేసారు. ఆ ఫొటోతో పాటు.. స్టేడియంలో బ్రహ్మి కనిపించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఆ పిక్స్ తో మీమర్స్ మీమ్స్ క్రియేట్ చేస్తూ నెటిజెన్స్ ని నవ్విస్తున్నారు. ఆ మీమ్స్ ని మీరు చూసేయండి.