Tillu Square : టిల్లు గాడి సక్సెస్ ని సెలబ్రేట్ చేయడం కోసం వస్తున్న టోనీ.. అట్లుంటది ఎన్టీఆర్‌తోని..
టిల్లు గాడి సక్సెస్ ని సెలబ్రేట్ చేయడం కోసం టోనీ వచ్చేస్తున్నాడు. అట్లుంటది ఎన్టీఆర్‌తోని..

Devara Star NTR is chief guest for Siddhu Jonnalagadda Tillu Square success event
Tillu Square : సిద్ధూ జొన్నలగడ్డ తన డీజే టిల్లుకి సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సినిమా ‘టిల్లు స్క్వేర్’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో రూపొందిన ఈ సీక్వెల్ ని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేసారు. ఈ సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్ లిల్లీగా వచ్చి టిల్లు గాడిని పరేషాన్ చేసి ముప్పతిప్పలు పెట్టేసింది. ఇక లిల్లీ-టిల్లు లొల్లి ఆడియన్స్ ని బాగా నవ్వించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మేకర్స్ సక్సెస్ మీట్ ని ప్లాన్ చేసారు. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ రాబోతున్నారు. డీజే టిల్లు సినిమా చూసి టిల్లు గాడి లొల్లికి పెద్ద ఫ్యాన్ అయ్యిపోయిన ఎన్టీఆర్.. ఇప్పుడు రిలీజైన సీక్వెల్ ని కూడా చూసి బాగా ఎంజాయ్ చేసారు. ఈ సినిమా బాగా నచ్చేయడంతో ఇటీవల తన ఇంటిలో టిల్లు గాడికి పార్టీ కూడా ఇచ్చారు ఎన్టీఆర్.
ఇప్పుడు సక్సెస్ మీట్ కి గెస్ట్ గా వచ్చి మూవీ యూనిట్ అంతా అభినందించబోతున్నారు. ఏప్రిల్ 8న ఈ సక్సెస్ మీట్ ని నిర్వహించబోతున్నట్లు టిల్లు నిర్మాతలు తెలియజేసారు. ఇక ఈ పోస్టు చూసిన ఎన్టీఆర్ ఆడియన్స్.. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ నోటి నుంచి టిల్లు గాడి డైలాగ్స్ వినబోతున్నామంటూ తెగ సంబరపడుతున్నారు. గతంలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లోనే ఎన్టీఆర్ ఈ టిల్లు డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
Also read : Kalki 2898 AD : కల్కి రిలీజ్ డేట్ కన్ఫార్మ్ అయ్యిపోయిందట.. ఆ తేదీకే కల్కి ఆగమనం..
tarak anna E edialouge chepthadu e sari success meet confirm ga? pic.twitter.com/UoQ9xdbb7I
— I’m Batman (@justRo21) April 6, 2024
కాగా ఈ సినిమా ఇప్పటివరకు 96.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఈ సండే పూర్తి అయ్యేపాటికీ 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసేసి సిద్ధూకి మొదటి 100 కోట్ల సినిమా ఇవ్వబోతుంది.