Genelia Deshmukh : స్టేజిపై ఏడ్చేసిన జెనీలియా, ఆమె భర్త.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఎమోషనల్.. వీడియోలు వైరల్..

Genelia Emotional: రితేష్ దేశ్‌ముఖ్, అతని భార్య, హీరోయిన్ జెనీలియా స్టేజిపై ఎమోషనల్ అయి ఏడ్చారు. (Riteish Deshmukh)

  • Updated on- April 21, 2026 / 12:21 PM IST

Riteish Deshmukh Genelia Emotional in Raja Sivaji Event

Genelia Deshmukh : బాలీవుడ్ నటుడు, జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తూ నిర్మాతగా ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు. రాజా శివాజీ పేరుతో ఈ సినిమా మే 1న రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సోమవారం నాడు ముంబైలో ఘనంగా జరిగింది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రితేష్ దేశ్‌ముఖ్, అతని భార్య, హీరోయిన్ జెనీలియా స్టేజిపై ఎమోషనల్ అయి ఏడ్చారు.

రితేష్ దేశ్‌ముఖ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సినిమా గురించి మాట్లాడుతూ, అలాగే తన తండ్రి, మహారాష్ట్ర మాజీ సీఎం, దివంగత నేత విలాస్ రావు దేశ్‌ముఖ్ ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో భర్తని చూసి జెనీలియా కూడా ఏడ్చేసింది. అనంతరం ఈ సినిమా కోసం తన భర్త ఎంత కష్టపడ్డాడో చెప్తూ జెనీలియా కూడా ఎమోషనల్ అయింది.

Also Read : ఛత్రపతి శివాజీ బయోపిక్.. ‘రాజా శివాజీ’ ట్రైలర్ చూశారా..? జెనీలియా భర్త అదరగొట్టాడుగా..

వీరి బాధని చూసి స్టేజిపై ఉన్న సంజయ్ దత్, అక్కడ ఈవెంట్ కి వచ్చిన అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యారు. దీంతో రాజా శివాజీ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో స్టేజిపై భార్యాభర్తలు ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇక ఈ సినిమాలో రితేష్ తో పాటు జెనీలియా, సంజయ్ దత్, విద్యా బాలన్, అభిషేక్ బచ్చన్, భాగ్యశ్రీ.. పలువురు బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజా శివాజీ సినిమాని మే 1న మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Also Read : Peddi : అసలు రీజన్ స్పెషల్ సాంగ్ కాదు.. మరి వాయిదాకు కారణం ఏంటి?