Ritika Nayak : ‘కొరియన్ కనకరాజు’తో మళ్ళీ హిట్.. హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతున్న రితికా నాయక్..
వరుసగా మూడు సినిమాల్లో హీరోయిన్ గా హ్యాట్రిక్ హిట్ అందుకుంది రితికా నాయక్.(Ritika Nayak)
- Saketh U
- Published on- August 7, 2026 / 07:39 PM IST
Ritika Nayak
Ritika Nayak : వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొరియన్ కనకరాజు సినిమా నేడు రిలీజయి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో రితికా హ్యాట్రిక్ హిట్ అందుకుంది. విశ్వక్ సేన్ తో అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మిరాయ్ సినిమాతో హిట్ కొట్టింది. ఇప్పుడు కొరియన్ కనకరాజు సినిమాతో హిట్ టాక్ తెచ్చుకుంది.
ఇలా వరుసగా మూడు సినిమాల్లో హీరోయిన్ గా హ్యాట్రిక్ హిట్ అందుకుంది రితికా నాయక్. ఈ మధ్యలో హాయ్ నాన్న సినిమాలో గెస్ట్ పాత్రలో మెరిపించింది. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. దీంతో టాలీవుడ్ కి మరో లక్కీ చార్మ్ దొరికింది అంటున్నారు.
Also Read : Varun Tej : కొరియన్ కనకరాజులో ఎన్టీఆర్ డైలాగ్ ను ఇమిటేషన్ చేసిన సత్య.. క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్..
అందంతో పాటు నటనతో కూడా మెప్పిస్తుంది రితికా. మొదటి సినిమాలోనే విలేజ్ అమ్మాయిగా బరువైన ఎమోషనల్ పాత్రలో నటించి మెప్పించింది. మిరాయి సినిమాలో సన్యాసి పాత్రలో కనిపించి డివోషనల్ టచ్ తో అలరించింది. ఇప్పుడు కొరియా పై ప్రేమ ఉన్న అమ్మాయి పాత్రలో పూర్తి కమర్షియల్ హీరోయిన్ గా మెప్పించింది రితికా నాయక్. దీంతో రితికా నాయక్ నటనకు ప్రశంసలు వస్తున్నాయి. ప్రస్తుతం రితికా చేతిలో ఇంకో రెండు సినిమాలు ఉన్నట్టు ఇటీవల కొరియన్ కనకరాజు ప్రమోషన్స్ లో తెలిపింది. ఈ సినిమా హిట్ తర్వాత ఈ భామకు మరిన్ని అవకాశాలు వచ్చేలా ఉన్నాయి.
