Varun Tej : కొరియన్ కనకరాజులో ఎన్టీఆర్ డైలాగ్ ను ఇమిటేషన్ చేసిన సత్య.. క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్..
ఈ సినిమాలో సత్య తన కామెడీతో ఫుల్ గా నవ్వించాడు. (Varun Tej)
Varun Tej
Varun Tej : వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొరియన్ కనకరాజు సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో సత్య తన కామెడీతో ఫుల్ గా నవ్వించాడు. ఈ సినిమాలో సత్య ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సీనియర్ ఎన్టీఆర్ అమెచ్యూరిష్ అనే డైలాగ్ ని ఇమిటేట్ చేస్తూ చెప్పడంతో అది థియేటర్లో బాగా పేలి ప్రేక్షకులు ఫుల్ గా నవ్వుకున్నారు.
అయితే కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇది ట్రోలింగ్ అనుకోని సీనియర్ ఎన్టీఆర్ ని అవమానించారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో నేడు జరిగిన కొరియన్ కనకరాజు ప్రెస్ మీట్ లో వరుణ్ తేజ్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఆ సీన్ మేము నవంబర్ నెలలోనే షూట్ చేశాము. ఇప్పుడు చేసింది కాదు. మేము ట్రోల్ చేయలేదు. ఇమిటేట్ చేశాము. ఇమిటేషన్ కు, ట్రోలింగ్ కు తేడా ఉంటుంది. అలాంటి గొప్ప యాక్టర్స్ ని ఇమిటేట్ చేస్తారు. ప్రమోషన్స్ లో సత్య చిరంజీవి, కృష్ణ గారిని కూడా ఇమిటేట్ చేసారు. ఎవరిని అగౌరవ పరచటం మా ఉద్దేశం కాదు అని అన్నారు.
సినిమాలోని ఒక సన్నివేశం లో నటుడు సత్య… Sr.NTR ని ఇమిటేట్ చెయ్యడం వివాదాస్పదం అవుతోంది. దీనిపై #VarunTej స్పందించారు.
ఇమిటేషన్ కు, ట్రోలింగ్ తేడా ఉంటుందని, కావాలని ట్రోలింగ్ చేయలేదని, ఎవరిని అగౌరవ పరచటం మా ఉద్దేశం కాదని అన్నారు.
సినిమా ప్రమోషన్స్ లో… pic.twitter.com/nfUbkO8Lpz
— Telugu360 (@Telugu360) August 7, 2026
గతంలో సత్య చాలా సినిమాల్లో సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి, రాజశేఖర్.. ఇలా పలువురు హీరోలను ఇమిటేట్ చేసి నవ్వించాడు. ఇప్పుడు కూడా అలాగే నవ్వించాడు అని అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు.
Sr NTR Classic Scene Recreated by Satya in Korean Kanakaraju | Varun Tej, Ritika Nayak | T Media Hub#SrNTR #comediansatya #KoreanKanakaraju #VarunTej #RitikaNayak #recreated #remake #reels #fb #TollywoodUpdates #tollywood #tmediahub pic.twitter.com/WWwFgVgrEI
— T Media Hub (@t_mediahub9) August 7, 2026
