Anshumalika Selvamani: అమెరికాలో చరిత్ర సృష్టించిన అన్షుమాలిక.. రోజా కుమార్తెకు అరుదైన ‘హెర్మన్ బి వెల్స్’ అవార్డు
Rk Roja - Anshumalika: కుమార్తె అన్షుమాలిక(Anshu Malika) సాధించిన అరుదైన ఘనతపై ఎమోషనల్ కామెంట్స్ చేసిన రోజా.
- V Santhosh Kumar
- Updated on- April 20, 2026 / 02:27 PM IST
Roja Daughter Anshumalika Wins America Prestigious Herman B Wells Award
- అమెరికా గడ్డపై అన్షుమాలిక సరికొత్త చరిత్ర
- రోజా కూతురుకి ప్రతిష్టాత్మక ‘హెర్మన్ బి వెల్స్’ అవార్డు
- ఎమోషనల్ పోస్ట్ పెట్టిన రోజా
Anshumalika Selvamani: మాజీ మంత్రి, సినీ నటి ఆర్‌కే రోజా కుమార్తె అన్షుమాలిక సెల్వమణి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సాధించారు. తెలుగు జాతి గర్వించేలా చేశారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక ఇండియానా యూనివర్సిటీ ప్రతి ఏటా ఒక ఉత్తమ విద్యార్థికి మాత్రమే అందించే అత్యున్నత ‘హెర్మన్ బి వెల్స్’ (2026) అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. అకడమిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభతో పాటు నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవలో చురుగ్గా పాల్గొన్నందుకు గానూ అన్షుకు ఈ గౌరవం దక్కింది.
*మెగాస్టార్ మూవీలో అనిల్ కపూర్.. కాస్టింగ్ తోనే అంచనాలు పెంచుతున్న డైరెక్టర్ బాబీ
ప్రస్తుతం ఇండియానా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న అన్షుమాలిక(Anshu Malika), తన కృషి, అంకితభావంతో ఈ ఘనత సాధించిన ఏకైక విద్యార్థినిగా చరిత్ర సృష్టించారు. గతంలో కూడా ఆమె ‘మౌరీన్ బిగ్గర్స్ లీడర్‌షిప్ అవార్డు’, ‘గ్రేస్ హాపర్ స్కాలర్‌షిప్’ వంటి పలు అంతర్జాతీయ పురస్కారాలను అందుకోవడం విశేషం. చదువుతో పాటు వెబ్ డెవలప్‌మెంట్, కోడింగ్, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె నిరంతరం ముందుంటున్నారు.
కుమార్తె సాధించిన ఈ అద్భుత విజయంపై రోజా సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. “కలల నుంచి గమ్యం వరకు.. మా చిన్నారి ఇండియానా యూనివర్సిటీ చరిత్రలో నిలిచిపోయింది. ఒక చిన్న కలగా మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు మాకు ఎంతో గర్వకారణంగా, ఎందరికో స్ఫూర్తిగా మారింది” అని పేర్కొన్నారు. నీ కష్టమే నిన్ను ఈ స్థాయికి చేర్చిందని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అన్షును ఉద్దేశించి ఆమె తన ఆనందాన్ని పంచుకున్నారు.
From dreams to destiny… 🫶
Our little girl has made history at @IndianaUniv by winning the prestigious Herman B Wells Award (2026).
What started as a small dream is now a moment of immense pride for us and an inspiration for many.
Your hard work, dedication, and courage have… pic.twitter.com/OCK09Y6P6F
— Roja Selvamani (@RojaSelvamaniRK) April 19, 2026
