Mega 158 Update: మెగాస్టార్ మూవీలో అనిల్ కపూర్.. కాస్టింగ్ తోనే అంచనాలు పెంచుతున్న డైరెక్టర్ బాబీ
Chiranjeevi Mega 158 Update: మెగాస్టార్ చిరంజీవి(Mega 158) హీరోగా వస్తున్న లేటెస్ట్ గ్యాంగ్ స్టార్ మూవీలో కీ రోల్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్.
bollywood star anil kapoor playing key role in chiranjeevi mega 158 movie
- మెగాస్టార్- బాబీ మూవీలో బాలీవుడ్ నటుడు
- కీ రోల్ చేస్తున్న అనిల్ కపూర్
- త్వలోనే మొదలుకానున్న షూటింగ్
Chiranjeevi Mega 158: మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి క్రేజీ కాంబోలో రెండో సినిమా పట్టాలెక్కబోతుండటంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ‘కాకాజీ’ అనే పవర్ఫుల్ టైటిల్ ను పరిశీలనలో ఉంది. ఒక ఇంటెన్స్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రానున్న ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.
*పల్లిచట్టంబి సినిమా వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన కాయదు.. సోషల్ మీడియాలో వైరల్
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండరీ నటుడు అనిల్ కపూర్(Mega 158) ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో సెన్సేషన్ సృష్టిస్తోంది. చిరంజీవి, అనిల్ కపూర్ వంటి ఇద్దరు దిగ్గజ నటులు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలో చిరు సరికొత్త ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తారని, మాస్ యాక్షన్ సన్నివేశాలతో పాటు గుండెను హత్తుకునే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా కథలో అంతర్లీనంగా ఉంటాయని తెలుస్తోంది.
దర్శకుడు బాబీ సిద్ధం చేసిన స్క్రిప్ట్‌పై మెగాస్టార్ పూర్తి విశ్వాసంతో ఉన్నారని, అందుకే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. మెగా మాస్ ఎలిమెంట్స్‌తో పాటు గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథ టాలీవుడ్లో సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
