Roshan Family : త్వరలో హృతిక్ రోషన్ ఫ్యామిలీ బయోపిక్.. తాత నుంచి మనవడి వరకు రోషన్ ఫ్యామిలీ..
బాలీవుడ్ లో చాలా ఫ్యామిలీలు తరతరాలుగా సినీ పరిశ్రమలోనే ఉన్నారు. అలాంటి వాటిల్లో హృతిక్ రోషన్ ఫ్యామిలీ ఒకటి. బాలీవుడ్ కి మూడు తరాలుగా సేవలు అందిస్తున్న ఈ రోషన్ ఫ్యామిలీపై బయోపిక్ రానుంది.
- Saketh U
- Published On : July 23, 2023 / 02:24 PM IST
Roshan Family Story Biopic coming soon in Bollywood
Roshan Family Biopic : ఇటీవల బయోపిక్ లు ఎక్కువగా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో బయోపిక్ లు రెగ్యులర్ గా వస్తున్నాయి. అయితే ఈ సారి వచ్చే బయోపిక్ ఒక ఫ్యామిలీకి సంబంధించింది. బాలీవుడ్ లో చాలా ఫ్యామిలీలు తరతరాలుగా సినీ పరిశ్రమలోనే ఉన్నారు. అలాంటి వాటిల్లో హృతిక్ రోషన్ ఫ్యామిలీ ఒకటి.
హృతిక్ రోషన్ తాత రోషన్ లాల్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ లో ప్రస్థానం మొదలుపెట్టి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. రోషన్ లాల్ భార్య ఐరా కూడా ప్రముఖ బెంగాలీ సింగర్. రోషన్ లాల్ పెద్ద తనయుడు రాకేష్ రోషన్ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. రాకేష్ రోషన్ భార్య పింకీ రోషన్ నిర్మాతగా పలు సినిమాలు నిర్మించింది. రాకేష్ రోషన్ తనయుడు హృతిక్ రోషన్ ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్నాడు. కూతురు సునైనా రోషన్ కూడా నిర్మాతగా, రచయితగా వ్యవహరిస్తుంది.
ఇక రోషన్ లాల్ చిన్న తనయుడు రాజేష్ రోషన్ సంగీత దర్శకుడయ్యాడు. రాజేష్ రోషన్ కూతురు పశీమా రోషన్ త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. తనయుడు ఈషన్ రోషన్ నిర్మాతగా ఉన్నారు. ఇలా రోషన్ లాల్ తో మొదలై కుటుంబం అంతా సినిమాల్లోనే ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్ కి మూడు తరాలుగా సేవలు అందిస్తున్న ఈ రోషన్ ఫ్యామిలీపై బయోపిక్ రానుంది.
Mouni Roy : హాస్పిటల్‌లో హీరోయిన్.. 9 రోజులు చాలా బాధపడ్డాను..
శశి రంజన్ దర్శకత్వంలో రాకేశ్ రోషన్ నిర్మాణంలో ఈ రోషన్ ఫ్యామిలీ ఆధారంగా బయోపిక్ రానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే షూట్ మొదలవుతుందని సమాచారం. ఈ సినిమాలో రోషన్ ఫ్యామిలీ అంతా కూడా కనపడనున్నట్టు సమాచారం. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
