కాన్సెప్ట్ పేరు చెప్పి సినిమా అద్బుతం.. మహాద్బుతం అని హైప్ క్రియేట్ చేస్తారు. ట్రైలర్లు, టీజర్స్ తో..ఆడియన్స్ లో క్యూరియాసిటీ కట్టలు తెంచుకునేలా చేస్తారు. తీరా..బోలెడన్ని ఎక్స్ పెక్టేషన్స్ తో థియేటర్ కి వెళ్తే.. బోర్ కొట్టిస్తోన్న కాన్సెప్ట్ పనిష్మెంట్ ఇస్తున్నాయి కొన్ని తెలుగు సినిమాలు. తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ అంటూ వస్తోన్న సినిమాలు ఆడియన్స్ ని అస్సలు ఆకట్టుకోలేకపోతున్నాయి. లేటెస్ట్ గా మెగా డాటర్ నిహారిక నటించిన సూర్యకాంతం సినిమా కూడా మొదటి నుంచి హైప్ క్రియేట్ చేసింది. కానీ చివరికి రొటీన్ ట్రయాంగిల్ స్టోరీతో బోర్ కొట్టించేసింది.
Read Also : లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై జగన్ కామెంట్లు
సూర్యకాంతం లాంటి స్టోరీతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. కొత్త కాన్సెప్ట్ అంటూ ఈ మధ్య కాలంలో వచ్చినా చాలా సినిమాలు ఆడియన్స్ ని హింస పెట్టాయి. ముఖ్యంగా యంగ్ హీరోలు శ్రీవిష్ణు, నారా రోహిత్ సినిమా సినిమాకి డిఫరెంట్ కాన్సెప్ట్ అంటూ ఊరిస్తారు. కానీ సినిమా రిలీజయ్యాక చూస్తే పెద్గగా ఏం లేదనిపిస్తుంది. గతేడాది శ్రీవిష్ణు నటించిన వీరభోగ వసంతరాయలు, నీది నాది ఒకే కథ సినిమాలు రిలీజ్ కి ముందు మంచి పాజిటివ్ బజ్ ని సంపాదించుకున్నాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేసి పిచ్చెక్కించాయి.
నారా రోహిత్ నటించిన ఆటగాళ్లు, శమంతకమణి, శంకర, రాజా చెయ్యివేస్తే లాంటి సినిమాలు కాన్సెప్ట్ పరంగా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసినా సినిమాలు మాత్రం అస్సలు ఆకట్టుకోలేకపోయాయి. ఇలా కాన్సెప్ట్ బెస్ట్ సినిమాల పరిస్థితి చెప్పెదొకటి.. తీసేదొకటి అన్నట్లు తయారైంది. దీంతో వెరైటీ సినిమాల్ని ఇష్టపడి థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ కి నిరాశే ఎదురవుతోంది.
Read Also : బాబోయ్.. బిల్లు కట్టేదెట్టా : కేబుల్, డీటీహెచ్ ఛానళ్లు వెరీ కాస్ట్‌లీ