RRR: స్వాతంత్ర్యం వచ్చాక కశ్మీర్ లో విడుదలైన మొదటి చిత్రం “RRR”..

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా, అక్కడ సినీ థియేటర్లకు మాత్రం మొన్నటివరకు స్వాతంత్ర్యం కలగలేదు. అయితే 32ఏళ్ల తర్వాత కశ్మీర్‌లోని సినిమా హాల్స్ ఈ ఆదివారం తెరుచుకున్నాయి. థియేటర్లను ప్రారంభించిన జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా..

RRR: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా, అక్కడ సినీ థియేటర్లకు మాత్రం మొన్నటివరకు స్వాతంత్ర్యం కలగలేదు. అయితే 32ఏళ్ల తర్వాత కశ్మీర్‌లోని సినిమా హాల్స్ ఈ ఆదివారం తెరుచుకున్నాయి. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. ‘ఫుల్వామా’, ‘షోపియాన్’ జిల్లాల్లో మల్టీఫ్లెక్స్ సినిమా హాళ్లను ప్రారంభించారు. ఇది చారిత్రాత్మక ఘట్టమని అయన అభివర్ణించారు.

RRR For Oscars: ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్.. ట్రెండింగ్‌కు కారణమిదే!

థియేటర్లను ప్రారంభించిన గవర్నర్ మనోజ్ సిన్హా.. పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ అయిన “RRR”ను ఆ థియేటర్ లో వీక్షించారు. ఇప్పటికే ఎన్నో ఘనతలు అందుకున్న ఈ సినిమా ఇటువంటి చారిత్రక క్షణంలో ప్రదర్శించబడడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ ఆడియన్స్. ఇప్పటి వరకు దేశం మొత్తం చూసిన RRR మానియాని, ఇప్పుడు కాశ్మీరీ వాసులు చూడబోతున్నారు.

అలాగే RRR తో పాటు హిందీ బ్లాక్ బస్టర్ మూవీ “భాగ్ మిల్కా భాగ్” కూడా ప్రదర్శించబడింది. ఇక వచ్చేవారం నుంచి కశ్మీర్‌లో తొలి ఐమాక్స్ మల్టీఫ్లెక్స్ ప్రారంభం కానుంది. శ్రీనగర్‌లోని సోమ్‌వార్ ప్రాంతంలో దీన్ని ప్రారభించనుండగా, ఇందులో 520 సీట్ల సామర్థ్యం కలిగిన మూడు స్ర్కీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ థియేటర్లను మల్టీప్లెక్స్ చైన్ ఐనాక్స్ ఏర్పాటు చేసింది.

ట్రెండింగ్ వార్తలు