‘రూలర్’ : గుమ్మడికాయ కొట్టేశారు!

నటసింహ నందమూరి బాలకృష్ణ ‘‘రూలర్’’ షూటింగ్ పూర్తి.. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల..

  • Publish Date - November 28, 2019 / 10:51 AM IST

నటసింహ నందమూరి బాలకృష్ణ ‘‘రూలర్’’ షూటింగ్ పూర్తి.. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల..

నటసింహ నందమూరి బాలకృష్ణ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించనున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘రూలర్’.. వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలు.. ప్రకాష్ రాజ్, జయసుధ, భూమికా చావ్లా కీలకపాత్రల్లో నటించారు.

ఇటీవల విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. ‘జైసింహా’ తర్వాత బాలయ్య, కె.ఎస్.రవికుమార్ కలయికలో వస్తున్న ‘రూలర్’ షూటింగ్ పూర్తిచేసుకున్నట్టు చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

డిసెంబర్ 15వ తేదీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగనుందని తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ‘రూలర్’  ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. సంగీతం : చిరంతన్ భట్, కెమెరా : సి.రామ్ ప్రసాద్, నిర్మాత : సి.కళ్యాణ్.