Bigg Boss 5 : తెలుగు బిగ్ బాస్ 5వ సీజన్ 19 మందితో మొదలైంది. ఇప్పటికే ఆరుగురు ఎలిమినేట్ అయిపోయారు. రోజు రోజుకి బిగ్ బాస్ గొడవలతో మంచి రసవత్తరంగా సాగుతుంది. ఈ వారం కూడా మరొకరు ఎలిమినేట్ అవ్వనున్నారు. ఇక కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ లో ఉంటే ఎలిమినేట్ అవ్వకుండా ఉండేందుకు తమకి ఓటు వేయాలి అని ప్రమోషన్స్ చేస్తారు. వేరే సెలెబ్రిటీలు కూడా తమకి కావాల్సిన వాళ్ళు బిగ్ బాస్ లో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి అంటూ ప్రమోట్ చేస్తారు. ఇలా చాలా మంది సెలబ్రిటీలు చేస్తారు. తాజాగా కుర్ర కారు మనసుని దోచేసిన ‘ఆర్ఎక్స్100’ భామ పాయల్ రాజ్ పుత్ కూడా తెలుగు బిగ్ బాస్ లో ఓ కంటెస్టెంట్ కి సపోర్ట్ చేస్తుంది.
Bigg Boss 5 : లవ్ ఫెయిల్యూర్.. సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను : షణ్ముఖ్
బిగ్ బాస్ లో ఈ వారం కాజల్, సిరి, రవి, యానీ, ప్రియ, శ్రీరామ్, జెస్సీ, లోబో.. ఇలా 8 మంది నామిషన్‌లో ఉన్నారు. ఇప్పటికే వీళ్ళ తరపున ఓట్లు వేయమని ప్రమోషన్లు చేస్తున్నారు. నిన్న ‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్ పాయల్ ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో పాయల్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో సింగర్ శ్రీరామచంద్రకు మద్దతు ఇస్తూ నా ఫ్రెండ్ శ్రీరామ్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నాడు. అతడు చాలా బాగా ఆడుతున్నాడు. నేను కొన్ని ఎపిసోడ్లలో శ్రీరామ్ పర్ఫామెన్స్ చూసి ఓ మై గాడ్ అనుకున్నాను. నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను శ్రీ. నా బెస్ట్ విషెస్ నీకెప్పుడూ ఉంటాయి. శ్రీరామ్‌కు ఓటేసి మీ ప్రేమాభిమానాలను చాటుకోండి. ప్రతీ ఒక్క ఓటు కూడా విలువైనదేనని గుర్తుంచుకోండి అని తెలిపింది. ఈ ప్రమోషన్ తో శ్రీరామ్ కి బాగానే ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. మరి పాయల్ అభిమానులు శ్రీరామ్ ని ఎప్పటిదాకా సేవ్ చేస్తారో చూడాలి.