హిందీ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ పాపులర్ కామెడీ షో ది కపిల్ శర్మ షో లో సందడి చెయ్యనున్న సాహో టీమ్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరికొద్ది రోజుల్లో సాహోగా సిల్వర్ స్క్రీన్స్‌పై సందడి చెయ్యబోతున్నాడు. ఆగస్టు 30న అత్యధిక థియేటర్లలో, తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో సాహో గ్రాండ్‌గా విడుదలవనుంది. గత కొద్ది రోజులుగా ప్రభాస్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. హిందీ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ పాపులర్ కామెడీ షో ది కపిల్ శర్మ షో లో సాహో టీమ్ పాల్గొంది. ప్రభాస్, శ్రద్ధా కపూర్‌తో పాటు నీల్ నితిన్ ముకేశ్ తదితరులు ఈ షోలో సాహో సినిమా విశేషాలను ప్రేక్షకులతో పంచుకోనున్నారు.
ఈ వారం టెలికాస్ట్ కానున్న ఈ ఎపిసోడ్‌లో కపిల్ శర్మ సాహో టీమ్‌ని సరాదాగా అడిగిన ప్రశ్నలకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. ‘మీరు యాక్ట్ చేసిన సినిమా రేపు రిలీజ్ అవుతుందంటే ముందు రోజు బాగా నిద్రపోతారనే రూమర్ ఉంది అది నిజమేనా’.. అని కపిల్ అడగ్గా.. ‘అవును.. ఆ రూమర్స్ నిజమే.. నా సినిమా ముందు రోజు బాగా నిద్రపోవాలనుకుంటాను.. కానీ తెల్లారితే సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందోనని టెన్షన్‌తో అసలు నిద్ర పట్టదు.. అని చెప్పాడు ప్రభాస్.
ఇక టాలీవుడ్‌లో మిమ్మల్ని యంగ్ రెబల్ స్టార్ అని పిలుస్తారు.. ఎందుకు? అని కపిల్ అడిగితే.. మా అంకుల్‌ని రెబల్ స్టార్ అని పిలిచే వాళ్లు.. ఆయన ఇప్పుడు యంగ్ కాదు.. సో అలా నన్ను యంగ్ రెబల్ స్టార్ అని పిలుస్తున్నారు అని చెప్పాడు. అలాగే ఒక ఆడియన్.. మీరు ఒక్కరోజు ప్రైమ్ మినిస్టర్ అయితే ఏం చేస్తారని అడగమన్నాడు అని కపిల్ చెప్తే.. ప్రభాస్ వెంటనే ఇండస్ట్రీ వాళ్లకి ఇంటర్వూలివ్వడం ఆపేస్తాను అని ఆన్సర్ ఇవ్వగా అక్కడున్నవారందరూ బాగా నవ్వేశారు. ఈ ఎపిసోడ్ బాలీవుడ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.