×
Ad

Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్‌కి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన ఆ సినిమాకి సీక్వెల్..

సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కొత్త కొత్త కథలతో వచ్చి ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. కానీ గతంలో వరుసగా ఆరు ఫ్లాప్స్ కూడా చూసాడు.

  • Published On : February 23, 2024 / 05:37 PM IST

Sai Dharam Tej Chitralahari Movie sequel Planning Rumours goes Viral

Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కొత్త కొత్త కథలతో వచ్చి ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. కానీ గతంలో వరుసగా ఆరు ఫ్లాప్స్ కూడా చూసాడు. కెరీర్ మొదట్లో నాలుగో సినిమా సుప్రీమ్ తో భారీ హిట్ కొట్టిన సాయిధరమ్ తేజ్ ఆ తర్వాత వరుసగా ఆరు ఫ్లాప్స్ చూడాల్సొచ్చింది. ఇక ఈ హీరో కెరీర్ అయిపోయింది, మెగా ఫ్యామిలీ నుంచి ఈ హీరో సినిమాలకు సెట్ అవ్వడు అని ఎన్నో కామెంట్స్ వచ్చాయి.

అలాంటి సమయంలో చిత్రలహరి(Chitralahari) అనే సినిమాతో వచ్చాడు సాయిధరమ్ తేజ్. ఒక ఫెయిల్యూర్ అబ్బాయి ప్రేమ కథ, మోటివేషనల్ అంశాలతో ఈ సినిమా తిరుమల కిషోర్ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కింది. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించగా, నివేదా పేతురేజ్, పోసాని కృష్ణ మురళి, సునీల్, వెన్నెల కిషోర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. వరుస ఫ్లాప్స్ తర్వాత చిత్రలహరి సినిమా రావడంతో ఎవ్వరికి ఈ సినిమాపై అంచనాలు లేవు. కానీ ఈ సినిమా స్లోగా మంచి విజయం సాధించి సాయిధరమ్ తేజ్‌కి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి 25 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి హిట్ కొట్టింది.

Also Read : Market Mahalakshmi : మార్కెట్ మహాలక్ష్మితో మజాక్ లాడితే మంచిగుండదు.. హీరో చెంపలు వాయించిన తల్లి, లవర్..

తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేయబోతున్నట్టు సమాచారం. తిరుమల కిషోర్ దర్శకత్వంలోనే సాయిధరమ్ తేజ్ హీరోగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో చిత్రలహరికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ సాయిధరమ్ తేజ్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం డైరెక్టర్ తిరుమల కిషోర్ చిత్రలహరి 2 ప్రీ ప్రొడక్షన్ మొదలుపెట్టినట్టు సమాచారం. సాయిధరమ్ తేజ్ కి కెరీర్ డౌన్ లో ఉన్నప్పుడు హిట్ ఇచ్చిన చిత్రలహరి సీక్వెల్ అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి మరి.