Sivaji : నాగార్జున ఇచ్చిన డబ్బులతో.. ఐదు ఎకరాలు కొనుక్కున్నా.. శివాజీ కామెంట్స్ వైరల్..
నేడు లెనిన్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Sivaji)
Sivaji
Sivaji : సెకండ్ ఇన్నింగ్స్ లో నటుడు శివాజీ దూసుకెళ్తున్నాడు. పదేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శివాజీ బిగ్ బాస్ తో రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వరుసగా వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తున్నాడు. తండ్రి పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అదరగొడుతున్నాడు. చేసిన ప్రతి పాత్రలో తన నటనతో మెప్పిస్తున్నాడు శివాజీ. సెకండ్ ఇనింగ్స్ లో శివాజీకి మంచి పాత్రలు పడుతున్నాయి. తాజాగా శివాజీ అఖిల్ లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమాలో యతిరాజు అనే పాత్రతో అందర్నీ మెప్పించాడు శివాజీ. నేడు లెనిన్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Hrudayam Murali Review : ‘హృదయం మురళి’ రివ్యూ.. అయిదుగురు హీరోయిన్స్, తమన్ నటించిన సినిమా..
శివాజీ మాట్లాడుతూ.. నాగార్జునతో నా బంధం ఎప్పట్నుంచో ఉంది. నేను ఇక్కడే అన్నపూర్ణ స్టూడియోలోనే మొదలయ్యాను. నా కెరీర్ నాగార్జున గారితోనే మొదలైంది. కెరీర్ ఆరంభంలో ఆయన నిర్మాణంలో సినిమా చేశాను. నాగార్జున గారి నిర్మాణంలో నేను చేసిన మొదటి సినిమాకి లక్ష పాతిక వేలు ఇచ్చారు అప్పట్లో. ఆ డబ్బులతో నేను మా ఊళ్ళో ఐదు ఎకరాల ముప్పై ఐదు సెంట్ల భూమి కొనుక్కున్నాను. ఈ విషయం బిగ్ బాస్ లో కూడా చెప్పాను. నేను ఎప్పటికి మర్చిపోలేను అని అన్నారు.
శివాజీ కెరీర్ ఆరంభంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మించిన శ్రీ సీతారాముల కళ్యాణం చూతుము రారండి సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఆ సినిమాకు గాను శివాజీకి నాగార్జున లక్ష పాతికవేల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ సినిమా 1998 లో వచ్చింది.
