Sai Dharam Tej : రామ్‌చరణ్ దర్శకుడితో సాయి ధరమ్ తేజ్ సినిమా.. నిజమేనా..?
ప్రస్తుతం పవన్ తో బ్రో సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్.. ఆ తరువాత రామ్ చరణ్ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడట.
- gum 95921
- Published On : June 25, 2023 / 08:03 PM IST
Sai Dharam Tej movie with Ram Charan director Sampath Nandi
Sai Dharam Tej : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవలే కమ్‌బ్యాక్ ఇస్తూ చేసిన సినిమా ‘విరూపాక్ష’. మిస్టిక్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సాయి ధరమ్ కెరీర్ లో మొదటి 100 కోట్లు అందుకున్న సినిమాగా విరూపాక్ష నిలిచింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో కలిసి Bro సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ కూడా రిలీజ్ కి సిద్దమవుతుంది. తాజాగా ఈ హీరోకి సంబంధించిన కొత్త సినిమా న్యూస్ ఒకటి ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది.
Dimple Hayathi : రష్మిక, నిధి అగర్వాల్‌ని ఫాలో అవుతున్న డింపుల్.. ఏ విషయంలో తెలుసా..?
రామ్ చరణ్ తో ‘రచ్చ’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన సంపత్ నంది.. తేజ్ తో ఒక సినిమా చేయబోతున్నాడట. సంపత్ నంది ఇటీవలే గోపీచంద్ తో ‘సీటిమార్’ అనే మాస్ మూవీ తీసి సూపర్ హిట్టుని అందుకున్నాడు. ఇక ఈ దర్శకుడు సాయి ధరమ్ కి తగ్గట్లు ఒక కథని రాసుకున్నాడట. ఆ కథని హీరోకి వినిపించగా తను కూడా ఒకే చెప్పేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, త్వరలోనే మూవీని అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
Pawan Kalyan: నాకు హీరోలందరూ ఎందుకు ఇష్టం అంటే? ఇవాళ మహేశ్ బాబు ఫ్యాన్ నన్ను కలిసి..?: పవన్ కల్యాణ్
అలాగే ఈ మూవీలో హీరోయిన్ కోసం పూజా హెగ్డే (Pooja Hegde) శ్రీలీల (Sreeleela) ను సంప్రదించినట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ వార్తలన్నీ ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇక బ్రో సినిమా విషయానికి వస్తే.. సోషియో ఫాంటసీ కథాంశంతో వస్తున్న ఈ చిత్రం తమిళ్ సినిమాకి రీమేక్ వస్తుంది. ఈ మూవీ షూటింగ్ దాదాపు మొత్తం పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది. జులై 28న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. వచ్చే వారం నుంచి మూవీ ప్రమోషన్స్ కూడా మొదలు కానున్నట్లు సమాచారం.
