Sai Dharam Tej : మిమ్మ‌ల్ని అభిమానుల్లా కాదు బ్రోస్ లా భావిస్తా.. ఆ ఒక్క ప‌ని మాత్రం చేయండి.. ప్లీజ్‌

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘బ్రో’. సినిమాను విజ‌యవంతం చేసినందుకు గాను ఇటీవ‌ల చిత్ర బృందం బ్రో విజ‌య యాత్ర చేసింది.

Sai Dharam Tej

Sai Dharam Tej post a letter : ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘బ్రో’. స‌ముద్ర ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో రూపుద్దిద్దుకున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ స‌క్సెస్ పుల్ ర‌న్ అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించిన ఈ సినిమా మొద‌టి మూడు రోజుల్లోనే వంద కోట్ల‌కుపైగా గ్రాస్ క‌లెక్ష‌న్లు అందుకుంది.

బో సినిమాను విజ‌యవంతం చేసినందుకు గాను ఇటీవ‌ల చిత్ర బృందం బ్రో విజ‌య యాత్ర చేసింది. ఈ యాత్ర‌లో అభిమానులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. వారంద‌రికి హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా థ్యాంక్స్ చెప్పాడు. అయితే.. ఈ యాత్ర‌లో కొంత మంది హెల్మెట్లు పెట్టుకోకుండా బైకులు న‌డ‌ప‌డం పై ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఎప్పుడైనా స‌రే బైక్‌ల‌పై ప్ర‌యాణించేట‌ప్పుడు హెల్మెట్లు త‌ప్ప‌క ధ‌రించాల‌ని ఆయ‌న కోరారు. ఫ్యాన్స్‌ను అభిమానుల్లా తాను చూడ‌న‌ని బ్రోస్‌ లాగే చూస్తాన‌ని చెప్పుకొచ్చారు.

Naga Chaitanya : మత్స్యకారులతో సముద్రంలో చేపల వేటకి వెళ్లిన నాగచైతన్య.. ఎందుకో తెలుసా..?

‘బ్రో విజ‌య‌యాత్ర‌లో భాగంగా మీరు నాపై చూపించిన అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్‌. అంద‌రినీ క‌లుసుకోవ‌డం, మీ ప్రేమ‌ను పొంద‌డం, సినిమా గురించి మీ నుంచి విన‌డం చాలా బాగుంది. అయితే.. న‌న్ను క‌ల‌వ‌డానికి వ‌చ్చే వారు ఫోటోలు, సెల్ఫీలు అంటూ ఆప్యాయంగా ద‌గ్గ‌రికొస్తున్నారు. వీలైనంత మేర‌కు నేను అంద‌రికీ అందుబాటులో ఉండ‌టానికే ప్ర‌య‌త్నిస్తున్నాను.

అయితే.. ఈ క్ర‌మంలో చాలా మంది హెల్మెట్ ధ‌రించ‌కుండా బైకుల మీద ఫాలో చేయ‌డం, డ్రైవింగ్ చేస్తూ సెల్పీలు, వీడియోలు తీసుకోవ‌డం వంటివి చేస్తున్నారు. ఈ విష‌యం నాకు ఎంతో భయాన్ని క‌లిగిస్తోంది. మీ అభిమానంతో ఇలా చేస్తున్న‌ప్ప‌టికీ ఆ క్ర‌మంలో మీకు ఎటువంటి హానీ జ‌రిగిన నాకు తీవ్ర మ‌న‌స్థాప‌న క‌లిగిస్తుంది. ఎందుకంటే మిమ్మ‌ల్ని అభిమానుల్లా క‌న్నా బ్రోస్‌లా భావిస్తాను. మీ భ‌ద్ర‌త నా బాధ్య‌త‌.

RGV – JD : ఒకే అమ్మాయిని ప్రేమించి.. పెళ్లి ప్రొపోజల్ పెట్టిన గురుశిష్యులు..

ద‌య‌చేసి మీరు బైక్ మీద వెళ్ళేట‌ప్పుడు త‌ప్ప‌కుండా హెల్మెట్ ధ‌రించండి. ఎట్టిప‌రిస్థితుల్లోను దీన్ని మ‌రిచిపోకండా. నాకు మీ ప్రేమ‌ని పొందుతూ ఉండే అవ‌కాశాన్ని ఇవ్వండి. అర్థం చేసుకోగ‌ల‌రు అని భావిస్తున్నాను.’ అని సాయిధ‌ర‌మ్ తేజ్ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో ఓ లేఖ‌ను పంచుకున్నారు.

Rajinikanth : రజినీకాంత్ కొత్త సినిమాలో నాని ప్రత్యేక పాత్ర.. నిజమేనా..?

ట్రెండింగ్ వార్తలు