SDT 17 : సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా అనౌన్స్.. SDT 17 త్రిశూలంతో పవర్ ఫుల్ లుక్..

సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు SDT16 మొదలుపెట్టకముందే SDT17 అనౌన్స్ చేశారు.

Sai Dharam Tej SDT 17 Movie announced under Sampath Nandi Direction

SDT 17 :  సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) యాక్సిడెంట్ తర్వాత గ్యాప్ తీసుకొని విరూపాక్ష సినిమాతో వచ్చి మొదటి 100 కోట్ల సినిమాగా గ్రాండ్ సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించి మెప్పించాడు. ఆ సినిమా తర్వాత SDT16 కొత్త డైరెక్టర్ జయంత్ తో అనౌన్స్ చేసినా ఇంకొంచెం హెల్త్ మీద ఫోకస్ చేయడానికి గ్యాప్ తీసుకున్నాడు తేజ్.

ఇప్పుడు SDT16 మొదలుపెట్టకముందే SDT17 అనౌన్స్ చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. సాయి ధరమ్ తేజ్ 17వ సినిమాని మాస డైరెక్టర్ సంపత్ నంది(Sampath Nandi) తెరకెక్కించబోతున్నాడు. తాజాగా ఈ సినిమాని ప్రకటిస్తూ ఓ పోస్టర్ కూడా రిలిజ్ చేశారు.

Also Read : Sreeleela : బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమాపై.. శ్రీలీల ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

SDT17 అనౌన్సమెంట్ పోస్టర్ లో తేజ్ ముఖం చూపించకుండా.. కేవలం సాయి ధరమ్ తేజ్ మెడపై త్రిశూలంతో, చెవిదిద్దుతో పవర్ ఫుల్ లుక్ ని చూపించారు. దీంతో ఈ సినిమా కూడా మాస్ అప్పీరెన్స్ తో ఏదో కొత్త కథే ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా గురించి మరింత సమాచారం రేపు ఉదయం ప్రకటించనున్నట్టు తెలిపారు. దీంతో మెగా అభిమానులు, తేజ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.