Sai Dharam Tej Swathi Reddy The Soul Of Satya Short Film Released by Ram Charan
The Soul Of Satya : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) విరూపాక్ష (Virupaksha), బ్రో (Bro) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. ఇప్పుడు మరో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. అయితే ఇది థియేటర్ సినిమా కాదు. ఒక షార్ట్ ఫిలిం. అప్పుడప్పుడు మన సెలబ్రిటీలు మంచి సందేశాత్మకమైన షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ ఉంటారు. సాయి ధరమ్ తేజ్ గతం లో డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయొద్దు అనే కాన్సెప్ట్ లో కూడా నటించాడు.
ఇప్పుడు ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా మరో ఎమోషనల్, ప్రేమ, దేశభక్తి అంశాలు ఉన్న సత్య అనే కాన్సెప్ట్ షార్ట్ ఫిలింతో వచ్చాడు. ఈ షార్ట్ ఫిలింలో సాయి ధరమ్ ఒక సోల్జర్ గా కనిపించాడు. అతని భార్యగా నటి కలర్స్ స్వాతి (Swathi Reddy) నటించింది. నేడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న ఈ షార్ట్ ఫిలింని రామ్ చరణ్ రిలీజ్ చేశారు.