Upasana : డెలివరీ జర్నీ వీడియో షేర్ చేసిన ఉపాసన.. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో.. డాక్టర్స్ ఏమన్నారంటే..
తాజాగా ఉపాసన తన డెలివరీ జర్నీ స్పెషల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Upasana)
Upasana
Upasana : రామ్ చరణ్ – ఉపాసన జంట ఇటీవల కవలపిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 31 రాత్రి ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లకు జన్మనిచ్చారు. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఉపాసన తన డెలివరీ జర్నీ స్పెషల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Upasana)
ఈ వీడియోలో.. అపోలో హాస్పిటల్ లో ఉపాసనకు డెలివరీ చేసిన వైద్యులు, ఉపాసన స్టాఫ్, మెగా అభిమానులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మాట్లాడారు. అలాగే చరణ్, ఉపాసనతో కలిసి అపోలో హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం, డెలివరీ తర్వాత చిరంజీవి మాట్లాడింది, ఫ్యాన్స్ సంబరాలు, ఫ్యాన్స్ కి స్వీట్స్ పంచిపెట్టడం.. ఇవన్నీ కూడా వీడియోలో చూపించారు.
Also Read : Sudharshan : తిండితిప్పలు లేకుండా రోజంతా వర్షంలో.. అయినా కూడా.. ఈ కమెడియన్ ప్రభాస్ కి ఇంత పెద్ద అభిమానా?
ఈ వీడియోలో ఉపాసనని ట్రీట్ చేసిన పలువురు డాక్టర్స్ మాట్లాడుతూ.. ఉపాసన చాలా ఆనందంగా ఉంది. అపోలోని తన ఇంటిలా ఫీల్ అవుతుంది. మొదటి సారి అడ్మిట్ అయిన రూమ్ లోనే ఇప్పుడు కూడా అడ్మిట్ అయింది. అది సెంటిమెంట్ మాకు. మేము చాలా మంచి కేర్ తీసుకున్నాం తల్లి పిల్లలకు. రెండు టీమ్స్ చూసుకున్నాం ఈ ప్రాసెస్ మొత్తం. ఒక టీమ్ హైదరాబాద్ అపోలో ఇంకో టీం చెన్నై అపోలో చిల్డ్రన్ హాస్పిటల్ నుంచి వచ్చారు. కాస్త ప్రెజర్ ఉంది సేఫ్ గా తల్లి పిల్లలని ఉంచాలని. చరణ్ ఉపాసనని ఆరాధిస్తాడు అంతే ప్రేమని పిల్లలకు ఇస్తాడు. ఈ జంట ముగ్గురు పిల్లలతో జీవితాంతం హ్యాపీగా ఉండాలి అని తెలిపారు.
ప్రముఖ ఆస్ట్రాలజర్ మాట్లాడుతూ.. నేను డెలివరీకి ఒక మంచి డేట్ & టైం చెప్పాను. జనవరి 31 రాత్రి 11.30 తర్వాత అని. వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను అని తెలిపారు. దీంతో జ్యోతిష్కుల సలహాలు తీసుకొని మంచి రోజున ఉపాసన అపోలో డాక్టర్స్ ఆదవార్యంలో కవలపిల్లలకు జన్మనిచ్చిందని తెలుస్తుంది. ప్రస్తుతం తల్లి, పిల్లలు ఇద్దరూ ఆరోగ్యగా ఉన్నారని సమాచారం.
Also Read : Santosh Soban : ఎక్కడున్నావమ్మా..? స్కూల్ గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్న సంతోష్ శోభన్.. పేరు చెప్పి..
