Aadi Sai Kumar : శంబాల హిట్ తర్వాత.. హాట్ భామతో ఆది కొత్త సినిమా..
శంబాల లాంటి హిట్ తర్వాత ఆది నుంచి రాబోతున్న సినిమాని తాజాగా ప్రకటించారు.(Aadi Sai Kumar)
Aadi Sai Kumar
Aadi Sai Kumar : ఆది సాయి కుమార్ ఇటీవల శంబాల సినిమాతో వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆల్మోస్ట్ 20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చాన్నాళ్ల తర్వాత ఆది మంచి విజయం సాధించడంతో సాయి కుమార్ ఫ్యామిలీ, ఫ్యాన్స్, పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా సంతోషం వ్యక్తం చేసారు. శంబాల లాంటి హిట్ తర్వాత ఆది నుంచి రాబోతున్న సినిమాని తాజాగా ప్రకటించారు.(Aadi Sai Kumar)
ఆది హీరోగా ‘జంగిల్’ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో గ్లామరస్ హీరోయిన్, సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫోజులతో ఫొటోలు షేర్ చేసే భామ వేదిక హీరోయిన్ గా నటిస్తుంది. హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తమిళ్, తెలుగులో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఫ్రైడే పిక్చర్స్ బ్యానర్ పై రాఘవ రెడ్డి పబ్బతి ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు.
Also Read : Upasana : డెలివరీ జర్నీ వీడియో షేర్ చేసిన ఉపాసన.. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో.. డాక్టర్స్ ఏమన్నారంటే..
ప్రస్తుతం జంగిల్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఫైనల్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని మూవీ యూనిట్ తెలిపింది. మరి శంబాల తర్వాత ఆది నుంచి రాబోతున్న జంగిల్ హారర్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
