Sai Pallavi came out after a Long Time Appearance in Naga Chaitanya Thandel Movie Opening
Sai Pallavi : సాయి పల్లవి.. మలయాళం అమ్మాయి అయినా తన సినిమాలతో, తన నటన, డ్యాన్స్ లు, తన పద్దతులతో సౌత్ అంతా అభిమానులని సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగులో మంచి మంచి సినిమాలు చేసి స్టార్ డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. చివరిసారిగా సాయి పల్లవి గార్గి సినిమాతో ప్రేక్షకులని పలకరించింది. ఈ సినిమా వచ్చి సంవత్సరం పైనే అయిపోయింది.
ఆ తర్వాత సాయి పల్లవి ఏ సినిమాలు ఓకే చేయకపోవడం, సినిమాలకు బ్రేక్ తీసుకోవడంతో ఆమె సినిమాలు మానేస్తుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ సినిమాలు ఒప్పుకుంటుంది. తమిళ్ లో శివ కార్తికేయన్ తో ఓ సినిమా, తెలుగులో నాగ చైతన్య సరసన సినిమా ప్రకటించడంతో సాయి పల్లవి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా యాక్టివా గా ఉండే సాయి పల్లవి చివరి సారిగా అయిదు నెలల క్రితం అమర్ నాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు ఫోటోలు షేర్ చేసింది. ఇక మీడియా ముందుకు వచ్చి సంవత్సరం పైనే అయిపోయింది. బయట ఎక్కడా సాయి పల్లవి కనిపించలేదు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. మొత్తానికి సాయి పల్లవి బయటకి వచ్చింది, మీడియా ముందుకి వచ్చింది.
నేడు నాగ చైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న ‘తండేల్'(Thandel) సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరగగా ఈ ఈవెంట్ కి సాయి పల్లవి వచ్చింది. ఎప్పటిలాగే పద్దతిగా పంజాబీ డ్రెస్ లో వచ్చి అందర్నీ మెప్పించింది. ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడింది.
Also Read : Thandel : మొదలైన ‘తండేల్’.. నాన్న, మామ ఆశీస్సులతో మొదలుపెట్టిన నాగ చైతన్య..
సాయి పల్లవి మీడియాతో మాట్లాడుతూ.. ఆల్మోస్ట్ రెండేళ్లు అయిపోయింది మీ ముందుకు వచ్చి. ఇలా మీ అందర్నీ చూస్తుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ బ్లెస్సింగ్స్ మాకు, సినిమాకు కావలి. సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ ఇంకా వస్తాయి అప్పుడు మరింత మాట్లాడతాను అని చెప్పింది. దీంతో చాలా గ్యాప్ తర్వాత సాయి పల్లవి మీడియా ముందు కనపడటంతో ఆమె ఫోటోలు, స్పీచ్ వైరల్ గా మారాయి. సాయి పల్లవి మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.