Sai Pallavi : సాయి పల్లవి అమర్‌నాథ్ యాత్ర.. వైరల్ అవుతున్న ఫోటోలు..
అమర్‌నాథ్ యాత్ర చేసిన సాయి పల్లవి. ఈ యాత్ర తన సంకల్ప శక్తికి, ధైర్యానికి పరీక్ష పెట్టింది అంటూ పోస్ట్.
- gum 95921
- Published On : July 16, 2023 / 06:51 AM IST
Sai Pallavi done Amarnath yatra with her parents post viral
Sai Pallavi : స్టార్ హీరోయిన్ సాయి పల్లవి.. చేసింది తక్కువ సినిమాలే అయినా తన స్క్రిప్ట్ సెలక్షన్ తో హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. చాలా గ్యాప్ తరువాత ఇటీవలే ఈ హీరోయిన్ తన కొత్త సినిమాని ప్రకటించింది. తమిళ హీరో శివ కార్తికేయన్ సరసన SK21 సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుంది. ఇక అక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకున్న తరువాత సాయి పల్లవి తన కుటుంబంతో కలిసి అమర్‌నాథ్ యాత్ర చేసింది. ఆ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
“అమర్‌నాథ్ యాత్రకి వెళ్ళాలి అన్నది ఎప్పటినుంచో ఉన్న కల. ఈ యాత్రకు 60 ఏళ్ల వయసున్న నా తల్లిదండ్రులను తీసుకువెళ్లడం ఎంతో సవాలు అనిపించింది. మధ్య యాత్రలో వారు అలిసిపోయి ఆయాసపడుతూ ఊపిరి తీసుకోవడానికి కష్టమనిపించి ఛాతిని పట్టుకోవడం వంటి పరిస్థితులు చూసి.. ‘స్వామీ మీరు ఎందుకని ఇంత దూరంలో ఉన్నారని ప్రశ్నించాను’. అయితే ఈ ప్రశ్నకు సమాధానం నాకు తిరుగు ప్రయాణంలో దొరికింది. అలిసిపోయిన కొందరు యాత్రికులు ‘ఓం నమః శివాయ’ అనే మంత్రిని జపించి వాలని వాళ్ళు పుంజుకొని తిరిగి ప్రయాణం మొదలు పెట్టడం. అలాగే అక్కడి గ్రామస్తులు, గుర్రాలు ఆ యాత్రికుల కాలనీ నెరవేర్చడానికి చేస్తున్న ప్రయత్నం నా మనసుని ఎంతో హత్తుకుంది. ఈ యాత్ర నా సంకల్ప శక్తికి, ధైర్యానికి పరీక్ష పెట్టింది” అంటూ పోస్ట్ పెట్టింది.
Sitara : సితార పాప జ్యువెల్లరీ యాడ్ కోసం తీసుకున్న రెమ్యునరేషన్‌తో ఏం చేసిందో తెలుసా..?
సాయి పల్లవి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె నటిస్తున్న SK21 విషయానికి వస్తే.. ఈ మూవీ దేశభక్తి నేపథ్యంతో రాబోతుందని తెలుస్తుంది. రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. లోకనాయకుడు కమల్‌హాసన్ (Kamal Haasan) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం గమనార్హం. జి.వి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తుండగా, సిహెచ్.సాయి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
