Pawan Kalyan first Instagram post : ఇన్‌స్టాగ్రామ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మొద‌టి పోస్ట్‌.. ఎప్ప‌టికీ గుర్తుండిపోయే జ్ఞాప‌కాలు..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(Pawan Kalyan)కి ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. శ‌నివారం ఆయ‌న ఇన్‌స్టాగ్రామ్‌లో మొద‌టి పోస్ట్ చేశారు. ఎప్ప‌టికీ గుర్తుండిపోయే జ్ఞాప‌కాలు అంటూ రెండు నిమిషాల 40 సెక‌న్లు ఉన్న వీడియోను పోస్ట్ చేశారు.

Pawan Kalyan first Instagram post : ఇన్‌స్టాగ్రామ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మొద‌టి పోస్ట్‌.. ఎప్ప‌టికీ గుర్తుండిపోయే జ్ఞాప‌కాలు..

Pawan Kalyan Instagram first post

Updated On : July 15, 2023 / 7:12 PM IST

Pawan Kalyan Instagram : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(Pawan Kalyan)కి ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ప‌వ‌న్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప‌వ‌న్ సినిమా వ‌చ్చిదంటే థియేట‌ర్ల వ‌ద్ద పండ‌గే. రాజ‌కీయాల్లోనూ ఆయ‌న బిజీగా ఉన్నారు. ట్విట్ట‌ర్‌లో యాక్టివ్‌గా ఉండే ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఒక్క పోస్ట్ కూడా పెట్ట‌కుండానే ఆయ‌న‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.4 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు. మొద‌టి పోస్ట్‌గా ఏం పెడుతారా అని అంద‌రూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Ravindra Mahajani : అద్దె ఇంట్లో శ‌వ‌మై క‌నిపించిన న‌టుడు.. సీఎం సంతాపం.. మూడు రోజుల క్రిత‌మే మృతి.. దుర్వాస‌న రావ‌డంతో..

ఈ క్ర‌మంలో శ‌నివారం ఆయ‌న ఇన్‌స్టాగ్రామ్‌లో మొద‌టి పోస్ట్ చేశారు. ఎప్ప‌టికీ గుర్తుండిపోయే జ్ఞాప‌కాలు అంటూ రెండు నిమిషాల 40 సెక‌న్లు ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. మ‌న బంధం ఇలాగే కొన‌సాగాల‌ని, మ‌రెన్నో మ‌ధుర‌మైన జ్ఞాప‌కాల్ని పంచుకోవాల‌ని ఆ వీడియోకి క్యాప్ష‌న్ ఇచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by Pawan Kalyan (@pawankalyan)

Sunny Leone : భ‌ర్త మోసం చేస్తుండ‌గా రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న న‌టి స‌న్నీలియోన్‌.. వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్‌

వీడియో ఆరంభంలో చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో భాగ‌మై ఎంతో మంది ప్ర‌తిభావంతుల‌తో, నిరాడంబ‌ర‌మైన వ్య‌క్తుల‌తో క‌లిసి ప్ర‌యాణిస్తుందుకు కృత‌జ్ఞుణ్ణి అంటూ అన్న‌య్య చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేశ్‌, అమితాబ్ బ‌చ్చ‌న్ తో ప‌వ‌న్ దిగిన ఫోటోలు ఉన్నాయి. అంతేకాకుండా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉన్న ప్ర‌ముఖుల‌తో దిగిన ఫోటోలు, వివిధ సంద‌ర్భాల్లో తీసుకున్న ఫోటోలు ఉన్నాయి. హీరోలు, హీరోయిన్లు, క‌మెడీయ‌న్లు, సంగీత ద‌ర్శ‌కులు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లు, త‌మిళ హీరోలు అలా అంద‌రితో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్న ఫోటోల‌ను వీడియో రూపొందించారు. వీడియో ఆఖ‌ర్లో మ‌న బంధం ఇలాగే కొన‌సాగాల‌ని, మ‌రెన్నో మ‌ధుర‌మైన జ్ఞాప‌కాల్ని పంచుకోవాల‌ని ఆశిస్తూ మీ ప‌వ‌న్ క‌ళ్యాన్ అంటూ రాసుంది.

Kushi : షూటింగ్ పూర్తి.. పుల్ స్వింగ్‌లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు.. సెల‌బ్రేష‌న్స్ చూశారా

ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.