Sai Pallavi: నేను చెప్పింది ఒకటి.. రాసింది ఇంకొకటి.. ఆ వార్తలు విని చాలా బాధేసింది
రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్ చేసిన సాయి పల్లవి(Sai Pallavi).
- V Santhosh Kumar
- Published on- April 23, 2026 / 09:09 PM IST
Sai Pallavi emotional comments on false propaganda being spread against her
Sai Pallavi: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సాయి పల్లవి తన సహజ సిద్ధమైన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కోయంబత్తూరులో జన్మించి, వైద్య విద్యను అభ్యసించిన ఈమె ‘ప్రేమమ్’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి అగ్ర కథానాయికగా(Sai Pallavi) ఎదిగారు. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో పాటు హిందీలో ‘ఏక్ దిన్’, ‘రామాయణ’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే, ఇటీవల సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ఒక తప్పుడు ప్రచారంపై ఆమె తీవ్రంగా స్పందించారు.
Neha Sharma: చిరుత హీరోయిన్ నేహా శర్మ.. ట్రెండీ లుక్స్ తో గ్లామర్ రచ్చ.. ఫొటోలు
గతంలో ఒక ఇంటర్వ్యూలో తాను మలయాళీని కాదని, తమిళ అమ్మాయినని చెప్పిన మాటలను కొందరు వక్రీకరించి రెండేళ్ల తర్వాత వైరల్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తన మూలాలు తమిళనాడులో ఉన్నాయని చెప్పాననే తప్ప, ఇతర భాషలను గానీ, వ్యక్తులను గానీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. వాస్తవాలను మార్చి తనను వివాదాల్లోకి లాగడం పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇటువంటి తప్పుడు ప్రచారాలు తనను ఎంతగానో గాయపరిచాయని పేర్కొన్నారు. నిబద్ధత గల నటిగా తన వృత్తిని గౌరవిస్తానని, అనవసర వివాదాలకు తావులేదని ఆమె వివరణ ఇచ్చారు.
