Sai Pallavi: గౌతమ్ తిన్ననూరి-సాయి పల్లవి కాంబో ఫిక్స్.. దిగ్గజ గాయని బయోపిక్‌పై క్లారిటీ!
అక్టోబర్ నుంచి మొదలుకానున్న దిగ్గజ గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ లో సాయి పల్లవి(Sai Pallavi)ని ఫిక్స్ చేసిన మేకర్స్.
- V Santhosh Kumar
- Published on- April 27, 2026 / 06:14 PM IST
Sai Pallavi starring in the MS Subbulakshmi biopic.
- ఎంఎస్ సుబ్బులక్ష్మిగా సాయి పల్లవి.
- గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో బయోపిక్.
- రుక్మిణి వసంత్ వార్తలు కేవలం రూమర్లే.
Sai Pallavi: తన సహజ సిద్ధమైన నటనతో, అద్భుతమైన డాన్స్ తో ‘లేడీ పవర్ స్టార్’గా స్టార్ పొజిషన్ కి చేరుకున్నారు సాయి పల్లవి. గ్లామర్ పాత్రలకు దూరంగా కథాబలం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. అలాగే, రానున్న సినిమాల విషయంలో కూడా అదే పద్దతిని ఫాలో అవ్వబోతున్నారు సాయి పల్లవి. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో రామాయణ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
Allu Arjun: అల్లు అర్జున్ 200 డేస్ స్ట్రిక్ట్ కండిషన్.. ఆ రూల్ దాటితే సినిమా వదిలేయాల్సిందే!
ఆలాగే, కల్కి సీక్వెల్ లో దీపికా పాడుకొనే ప్లేస్ లో ఆమె నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే మరో క్రేజీ మూవీకి కూడా ఆమె ఒకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, దిగ్గజ గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో సాయి పల్లవి(Sai Pallavi) నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టును మళ్ళీ రావా, జెర్సీ వంటి క్లాసిక్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందించనున్నారట.
అయితే, ఈ సినిమా మేకర్స్ ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రకు సాయి పల్లవి మాత్రమే సరైన న్యాయం చేయగలరని భావిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ 2026 అక్టోబర్ నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే, గతంలో కన్నడ నటి రుక్మిణి వసంత్ ఈ బయోపిక్ లో నటిస్తారంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, ఆ రూమర్లలో ఎలాంటి నిజం లేదని, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్ర కోసం సాయి పల్లవి ఇప్పటికే సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మరి చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది చూడాలి.
