Allu Arjun: అల్లు అర్జున్ 200 డేస్ స్ట్రిక్ట్ కండిషన్.. ఆ రూల్ దాటితే సినిమా వదిలేయాల్సిందే!
అల్లు అర్జున్(Allu Arjun) తన నెక్స్ట్ సినిమాల దర్శకులకు 200 డేస్ కండీషన్ పెడుతున్నారట.
Allu Arjun Strict 200 Day Condition for Directors
- దర్శకులకు బన్నీ 200 రోజుల నిబంధన.
- లోకేష్ కనగరాజ్ సినిమా నుండే అమలు.
- సినిమాల వేగం పెంచేలా సరికొత్త వ్యూహం.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రాబోయే ప్రాజెక్టుల విషయంలో అత్యంత కఠిణంగా ఉండబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇకనుంచి తను నటించే ప్రతి సినిమాకు గరిష్టంగా 200 రోజులు మాత్రమే కాల్షీట్లు కేటాయించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా షూటింగ్ పూర్తి కాకపోతే, ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి లేదా మరో సినిమాను ప్రారంభించేలా దర్శకులకు స్పష్టమైన కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. కెరీర్ పరంగా వేగంగా సినిమాలు చేసే విదంగానే బన్నీ ఈ క్రమశిక్షణతో కూడిన నిబంధనను తెరపైకి తెచ్చారట.
Sahithi Dasari: బాబోయ్.. టాప్ తీసేసి.. టాప్ లేచిపోయే అందంతో.. సాహితి దాసరి గ్లామర్ షో
షెడ్యూల్స్ ప్రకారం, అల్లు అర్జున్ (Allu Arjun)ఈ ఏడాది అక్టోబర్ నుండి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. ఆ తర్వాత 2027 ఏప్రిల్ నుండి మరో కొత్త సినిమాను ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. గతంలో పుష్ప వంటి సినిమాల కోసం సుదీర్ఘ కాలం వేచి చూడాల్సి రావడంతో, భవిష్యత్తులో అలాంటి ఆలస్యం జరగకుండా ఉండేందుకు ఈ ‘200 రోజుల రూల్’ ను అమలు చేయబోతున్నారట. దీనివల్ల అనుకున్న సమయానికి సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు.
ఈ వ్యూహంలో భాగంగానే మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ ప్రాజెక్టును కూడా సమాంతరంగా పట్టాలెక్కించే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఏదైనా సినిమా షూటింగ్ ఆలస్యమైతే, సమయాన్ని వృథా చేయకుండా మరో సినిమా షూటింగ్లో పాల్గొనడం ద్వారా ఏడాదికి కనీసం ఒకటైనా విడుదల చేయాలనేది ఆయన టార్గెట్ గా పెట్టుకున్నారట. ఈ నిర్ణయం టాలీవుడ్లో కొత్త చర్చకు దారితీసింది. దర్శకులు కూడా ఇప్పుడు ఈ పరిమితిలోపే అవుట్పుట్ ఇచ్చేలా తమ పనితీరును వేగవంతం చేయాల్సి ఉంటుంది. మరి ఈ కండీషన్ ఏమేరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.
