Saipallavi: ముసుగేసుకుని ప్రేక్షకుల మధ్యలో సినిమా చూసిన సాయిపల్లవి!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాలో మహేష్ మాస్ స్వాగ్‌తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. రివ్యూలు మాత్రం అంతంత మాత్రంగా రావడంతో ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ సాధిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.
- Naresh Mannam
- Published On : May 16, 2022 / 03:23 PM IST
Saipallavi
Saipallavi: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాలో మహేష్ మాస్ స్వాగ్‌తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. రివ్యూలు మాత్రం అంతంత మాత్రంగా రావడంతో ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ సాధిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. కానీ, ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. మహేష్ మేనరిజం విపరీతంగా ఆకట్టుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మహేష్‌కు ఉన్న క్రేజ్‌తో ఈ సినిమాకు తొలి రోజున కళ్లు చెదిరే వసూళ్లు వచ్చి పడ్డాయి.
Saipallavi : బాలీవుడ్‌కి రెడీ అంటున్న సాయి పల్లవి
ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ఏలో అదిరిపోయే వసూళ్లు సాధించి అదరగొడుతుంది. పాండెమిక్ తరువాత తొలిరోజు ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడంలో ఆర్ఆర్ఆర్ తరువాత సర్కారు వారి పాటకే సాధ్యమయ్యింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే ఏకంగా రూ.130 కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇది ఆల్‌టైమ్ రికార్డు అని వారు ప్రకటించారు. ఈ సినిమా చూసేందుకు సాధారణ ప్రేక్షకులే కాదు.. సినీ సెలబ్రిటీలు సైతంగా ఆసక్తి చూపిస్తున్నారు.
Sai Pallavi: సైలెంట్‌గా సాయిపల్లవి.. బ్రేక్ ఇచ్చిందా.. బ్రేక్ వచ్చిందా?
తాజాగా హీరోయిన్ సాయిపల్లవి కూడా సర్కారు వారి పాట సినిమా చూసి థియేటర్ నుండి బయటకొచ్చే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమా చూసేందుకు సాయిపల్లవి ముసుగేసుకుని మరీ థియేటర్‌కు వెళ్లింది. హైదరాబద్ లోని పీవీఆర్ ఆర్‌కే సినీప్లెక్స్‌లో సాయి పల్లవి ఈ సినిమా చూసి వచ్చేటప్పుడు పేస్ కి మాస్క్, స్కార్ఫ్ ధరించి ఎవరూ గుర్తు పట్టకుండా ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు థియేటర్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే.. ఎవరో వీడియో తీసి దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Yesterday @Sai_Pallavi92 mam Watched #SarkaruVaariPaata movie at PVR RK Cineplex (Hyderabad) 😃♥#SaiPallavi pic.twitter.com/e94wnk2OpM
— Sai Pallavi FC™ (@SaipallaviFC) May 15, 2022
