Saipallavi : బాలీవుడ్‌కి రెడీ అంటున్న సాయి పల్లవి

సాయి పల్లవి తెలుగులో వరుస సినిమాలు వరుస విజయాలతో దూసుకెళ్తుంది. మిగతా హీరోయిన్స్ కి భిన్నంగా చాలా న్యాచురల్ గా ఉండే పాత్రల్ని తీసుకుంటూ తన నటనతో, తన డ్యాన్స్ తో...............

Saipallavi : బాలీవుడ్‌కి రెడీ అంటున్న సాయి పల్లవి

Sai Pallavi

Saipallavi :   మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి తెలుగులో వరుస సినిమాలు వరుస విజయాలతో దూసుకెళ్తుంది. మిగతా హీరోయిన్స్ కి భిన్నంగా చాలా న్యాచురల్ గా ఉండే పాత్రల్ని తీసుకుంటూ తన నటనతో, తన డ్యాన్స్ తో ప్రేక్షకులని మెప్పిస్తూ అభిమానుల్ని సంపాదించుకుంటుంది. సాయి పల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. ఇప్పుడు తమిళ్, తెలుగు సినిమాలతో బిజీగా ఉంది సాయి పల్లవి.

Manikya Vinayagam : ‘శంకర్ దాదా’ సింగర్ మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం

ఇటీవలే నాని సరసన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంతో మన ముందుకి వచ్చి విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సాయి పల్లవి చేసిన పాత్రకి మంచి పేరు వస్తుంది. అయితే ఈ సినిమా దక్షిణాదిన అన్ని భాషల్లో రిలీజ్ అయింది. ఇప్పటికే మలయాళం, తెలుగు, తమిళ్ సినిమాలలో నటిస్తున్న సాయి పల్లవి ఈ సినిమాతో కన్నడలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఎంట్రీ గురించి అడగగా… హిందీ చిత్రాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు, సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. పాత్ర బావుండాలి, బలమైన పాత్ర ఉంటే చేయడానికి సిద్ధం అన్నట్లు తెలిపింది సాయి పల్లవి. అందరి హీరోయిన్స్ లాగే సౌత్ లో బాగా క్లిక్ అయి బాలీవుడ్ కి చెక్కేస్తున్న భామల్లో సాయి పల్లవి కూడా చేరనుందా అని అనుకుంటున్నారు ప్రేక్షకులు.