Sai Pallavi: సైలెంట్‌గా సాయిపల్లవి.. బ్రేక్ ఇచ్చిందా.. బ్రేక్ వచ్చిందా?

టాలీవుడ్ స్టార్స్ పొగిడేస్తున్నారు.. ఫ్యాన్ ఫాలోయింగ్ హై రేంజ్ లో ఉంది.. లేడీ పవర్ స్టార్ అన్న ట్యాగ్ లైన్ కూడా యాడ్ అయింది. అయినా సరే సాయిపల్లని చేతిలో ఒక్కటి.. ఒక్కటంటే ఒక్క..

Sai Pallavi: సైలెంట్‌గా సాయిపల్లవి.. బ్రేక్ ఇచ్చిందా.. బ్రేక్ వచ్చిందా?

Sai Pallavi

Sai Pallavi: టాలీవుడ్ స్టార్స్ పొగిడేస్తున్నారు.. ఫ్యాన్ ఫాలోయింగ్ హై రేంజ్ లో ఉంది.. లేడీ పవర్ స్టార్ అన్న ట్యాగ్ లైన్ కూడా యాడ్ అయింది. అయినా సరే సాయిపల్లని చేతిలో ఒక్కటి.. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. ఇంత క్రేజ్ ఉంచుకొని డబ్బు సంపాదించే అవకాశాలు పుశ్కలంగా ఉన్నా.. న్యాచురల్ బ్యూటీ ఏం ఆలోచిస్తుంది.. ఎందుకు ఆలోచిస్తోంది..?

Sai Pallavi : ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఈవెంట్‌లో చీర కట్టులో మెరిసిన సాయిపల్లవి

బ్రేక్ ఇచ్చారా.. బ్రేక్ వచ్చిందా.. సాయపల్లవి ఒక్కసారిగా సైలెంట్ అవడంపై ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తోంది. గతేడాది లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ రెండు సినిమాలను రిలీజ్ చేసి రెండు హిట్స్ ను తన అకౌంట్ లో వేసుకున్నారు సాయిపల్లవి. కానీ కొత్తగా ఏ సినిమాకు ఆమె కమిట్ మెంట్ ఇవ్వలేదు. కరెక్ట్ గా చెప్పాలంటే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన విరాటపర్వం మాత్రమే సాయిపల్లవి సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదీ ఎప్పుడన్నది క్లారిటీ లేదు.

Sai Pallavi : నాగశౌర్య వ్యాఖ్యలపై మూడేళ్ళ తర్వాత స్పందించిన సాయి పల్లవి

టాలీవుడ్ లో సాయిపల్లవికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె సినిమా వస్తుందంటే, ఆమె ఓ ఫంక్షన్ కు అటెండ్ అవుతున్నారంటే.. కేవలం తన కోసమే వచ్చే అభిమానులున్నారు. ఇండస్ట్రీలో కూడా సాయిపల్లవితో సినిమా చేసేందుకు కొందరు స్టార్స్ ఎదురుచూస్తున్నారు. భోళాశంకర్ లో చెల్లెలుగా ఒప్పుకోలేదని.. ఆమె ఒప్పుకుంటే ఆమెతో డాన్స్ చేయాలనుందని మెగాస్టార్ రిక్వెస్ట్ చేసి లవ్ స్టోరీ ఈవెంట్ లో వావ్ అనిపించారు.

Sai Pallavi: ప్లీజ్.. నన్ను ఏడిపించకండి..!

లేడీ పవర్ స్టార్ అని సుకుమార్ లాంటి డైరెక్టర్ సాయిపల్లవిని ఈమధ్యే పొగిడారు. న్యాచురల్ స్టార్ గా, సూపర్బ్ డాన్సర్ గా ప్రెజెంట్ ఏ హీరోయిన్ లో లేని కొన్ని ఎలిమెంట్స్ సాయిపల్లవిలో కనిపిస్తాయి. అయినా సరే తనకు నచ్చినప్పుడు నచ్చిన క్యారెక్టర్ చేయడం మాత్రమే ఆమెకు అలవాటు. ప్రస్తుతం బ్రేక్ మోడ్ లో ఉన్న ఈ హీరోయిన్.. ఎప్పుడు ప్రాజెక్ట్ ప్రకటిస్తారా అని ఆమె ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే కొన్నాళ్లకు మాత్రం పూర్తిగా సినిమాలకు బైబై చెప్పేసి డాక్టర్ గా స్థిరపడాలనేది ఆమె కోరిక.