Rajamouli : సలార్ ఫస్ట్ టికెట్ కొన్న రాజమౌళి.. స్పెషల్ ఇంటర్వ్యూ పిక్ లీక్.. ప్రభాస్ ఎలా ఉన్నాడో చూడండి..

ఆల్రెడీ రాజమౌళి(Rajamouli).. ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో ఓ ఇంటర్వ్యూ చేశారని, ఆ ఇంటర్వ్యూ త్వరలో రిలీజ్ చేయనున్నారని సమాచారం.

Salaar Movie Promotional Interview Pic Released Rajamouli buys Salaar first Ticket

Rajamouli : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కిన సలార్(Salaar) సినిమా కోసం అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ సీజ్ ఫైర్ ఇప్పటికే పలు మార్లు వాయిదా పడి డిసెంబర్ 22న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది. సలార్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సలార్ సినిమాకి అసలు ప్రమోషన్స్ చెయ్యట్లేదు చిత్ర యూనిట్. ఇప్పటివరకు సినిమాకి సంబంధించి ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక్క ఇంటర్వ్యూ కూడా చేయలేదు. ఒక్క ఈవెంట్ కూడా పెట్టలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

అయితే సలార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లేదని, కానీ ఆల్రెడీ రాజమౌళి(Rajamouli).. ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో ఓ ఇంటర్వ్యూ చేశారని, ఆ ఇంటర్వ్యూ త్వరలో రిలీజ్ చేయనున్నారని సమాచారం. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెలుగు మీడియాతో ఆదివారం నాడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారని తెలుస్తుంది. దీంతో ప్రభాస్ అభిమానులు రాజమౌళితో చేసిన ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నారు.

Also Read : Salaar Promotions : సలార్ ప్రమోషన్స్ కోసం రాజమౌళి.. ప్రమోషన్స్ ఇంతేనా? ప్రభాస్ బయటకి రాడా?

తాజాగా ఈ ఇంటర్వ్యూ నుంచి ఓ ఫోటో రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సలార్ సినిమా నైజామ్ హక్కులని మైత్రి మూవీ మేకర్స్ కొనుక్కోవడంతో ఈ ఇంటర్వ్యూలో మైత్రి నిర్మాత రాగా సలార్ ఫస్ట్ టికెట్ రాజమౌళి కొనుక్కున్నారు. ఈ ఫొటోలో రాజమౌళి, ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్విరాజ్ సుకుమారన్, మైత్రి నిర్మాతలు ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. సినిమా ప్రమోషన్స్ చేయకపోయినా కనీసం ఈ ఇంటర్వ్యూ అయినా త్వరగా రిలీజ్ చేయాలని కోరుతున్నారు అభిమానులు, నెటిజన్లు.