×
Ad

Salaar Trailer : ప్రభాస్ సలార్ ట్రైలర్ ఆ రోజే రిలీజ్.. పక్కా అంటున్న ఫ్యాన్స్.. నీల్ ఏం ప్లాన్ చేశాడో?

ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ సలార్ పార్ట్ 1 సినిమా డిసెంబర్ 22న రాబోతున్నట్టు ప్రకటించారు. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

  • Published On : October 4, 2023 / 10:16 AM IST

Salaar Movie Trailer will releasing on Prabhas Birthday Movie Unit Planning accordingly

Salaar Trailer :  ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) నుంచి రాబోతున్న సినిమా ‘సలార్’. బాహుబలి తర్వాత వచ్చిన మూడు సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ మిగల్చడంతో అభిమానులంతా సలార్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా, మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా, శ్రియారెడ్డి, మరికొంతమంది స్టార్ ఆర్టిస్టులు ముఖ్య పాత్రల్లో భారీ మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుంది సలార్.

ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ సలార్ పార్ట్ 1 సినిమా డిసెంబర్ 22న రాబోతున్నట్టు ప్రకటించారు. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా టీజర్ రిలీజ్ చేసినా సినిమా ప్రమోషన్స్ అయితే మొదలుపెట్టలేదు. ఈ నెలలో అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు ఉంది. దీంతో ప్రభాస్ పుట్టిన రోజు నాడు సలార్ ట్రైలర్ రిలీజ్ అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ లో టాక్ వినిపిస్తుంది. సలార్ సినిమా లేట్ అయినందుకు, ప్రమోషన్స్ ఏమి మొదలు పెట్టనందుకు, ఇటీవల ఈ సినిమా కన్నడ ఉగ్రమ్ రీమేక్ అనే వార్తలు వస్తున్నందుకు అభిమానులు చిత్రయూనిట్ పై కోపంగా ఉన్నారు.

Also Read : Anasuya Tattoos : అనసూయ ఒంటిపై ఉన్న టాటూలు.. వాటి మీనింగ్స్ ఇవే అంట..

దీంతో చిత్రయూనిట్ కూడా ప్రభాస్ పుట్టిన రోజుకు సలార్ ట్రైలర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని కూల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సినిమా రిలీజ్ కి ముందు ఇంకో ట్రైలర్ కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు ట్రైలర్ ప్రభాస్ పుట్టిన రోజున రిలీజ్ చేయాల్సిందే అని సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. మరి ట్రైలర్ వస్తుందా రాదో ప్రభాస్ పుట్టిన రోజు దాకా ఎదురు చూడాల్సిందే.