సల్మాన్ ఫ్యామిలీకి నెగెటివ్

  • Publish Date - November 20, 2020 / 12:26 PM IST

salman-khan

Salman Khan Test Negative: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్ పర్సనల్ డ్రైవరుతో పాటు మరో ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకడంతో, సల్మాన్ ఫ్యామిలీతో కలిసి హోం క్వారంటైన్‌కి వెళుతున్నట్లుగా ప్రకటించారు. అలాగే కరోనా బారిన పడిన తన సిబ్బందిని సల్మాన్ ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.


ఆ తర్వాత సల్మాన్‌ ఫ్యామిలీకి కరోనా పరీక్షలు జరపగా.. సల్మాన్‌తో పాటు, అతని ఫ్యామిలీ మెంబర్స్‌ అందరికీ నెగిటివ్‌ గా నిర్థారణ అయింది. ఎటువంటి లక్షణాలు లేకపోయినా.. ఫ్యామిలీ మాత్రం 14 రోజుల పాటు హోమ్‌ క్వారంటైన్‌లోనే ఉండాలని సల్మాన్‌ ఖాన్‌ ఫ్యామిలీ నిర్ణయించుకున్నారు.



https://10tv.in/pranitha-subhash-maldives-vacation-pics-goes-viral/
సల్మాన్‌కి నెగిటివ్‌ అని తేలడంతో.. ఆయన ఫ్యాన్స్, బాలీవుడ్‌ వర్గాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఇటీవలే ‘రాధే’ షూటింగ్ పూర్తి చేసిన సల్లూ భాయ్ ప్రస్తుతం ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్-14 కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.