బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ షూటింగ్ లొకేషన్‌లో పోతరాజు వేషదారణలో ఉన్న కొందరిని కలిశారు. కొరడా పట్టుకొని చాలా గట్టిగా కొట్టుకొని టెస్ట్ చేశారు.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఐదు పదుల వయస్సులోను ఎంతో చలాకీగా ఉంటారు. అందరితో సరదాగా ఉంటూ ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన షూటింగ్ లొకేషన్‌లో పోతరాజు వేషదారణలో ఉన్న కొందరిని కలిశారు. వారి చేతిలో ఉండే కొరడా గురించి తెలుసుకున్నారు.
అంతేకాదు దాని పనితనం ఎలా ఉంటుందో టెస్ట్ కూడా చేశారు. కొరడా పట్టుకొని చాలా గట్టిగా కొట్టుకొని టెస్ట్ చేశారు. కొద్దిసేపు వారితో ముచ్చటించిన ఆసక్తికర సన్నివేశాలకి సంబంధించిన వీడియోని సల్మాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
పోతరాజుల అనుభూతుల్ని, బాధను పంచుకోవటం ఆనందంగా ఉందని, ఇది మీపై మీరు ప్రయత్నించకండి.. మరొకరి మీద కూడా ప్రయోగించకండి’ అంటూ సరదాగా ట్వీట్ చేశారు సల్మాన్. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న దబాంగ్ 3 షూటింగ్‌లో బిజీగా ఉన్న సల్మాన్ ఇన్షా అల్లా అనే చిత్రం కూడా చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక్ పడింది.