Salman Khan : 19 అంతస్థుల బిల్డింగ్‌ని.. ఆమె పేరున రిజిస్టర్ చేయించిన సల్మాన్.. నిజమేనా?
సల్మాన్ ఖాన్ ముంబైలోని ఒక ప్రైమ్ లొకేషన్ లో 19 అంతస్థులు హోటల్ ని నిర్మించబోతున్నాడట. ఈ బిల్డింగ్ సల్మాన్ ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయించాడో తెలుసా?
- gum 95921
- Published On : May 20, 2023 / 04:39 PM IST
Salman Khan plan to construct sea face 19 Storey building at mumbai
Salman Khan 19 Storey Building : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇటీవలే కిసీకా భాయ్ కిసీకి జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తమిళ ‘వీరం’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది. ప్రస్తుతం టైగర్ 3 (Tiger 3) సినిమాలో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే, సల్మాన్ కి సంబంధించిన ఒక న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. ముంబైలోని (Mumbai) ఒక ప్రైమ్ లొకేషన్ లో 19 అంతస్థులు హోటల్ ని నిర్మించబోతున్నాడట.
Salman Khan : టైగర్ 3 సెట్స్ లో సల్మాన్ ఖాన్‌కి గాయం.. పిక్ వైరల్!
సముద్రం ఫేసింగ్ వచ్చేలా ఉండే ఆ బిల్డింగ్ ని BMC లో (BrihanMumbai Municipal Corporation) తన తల్లి పేరు సుశీల చారక్ (Sushila Charak) మీద రిజిస్టర్ చేయించాడట సల్మాన్. ఫస్ట్ రెండు ఫ్లోర్స్ లో కేఫ్, మూడో ఫ్లోర్ లో జిమ్ అండ్ స్విమింగ్ పూల్. 4వ అంతస్థు సర్వీస్ కి, 5 అండ్ 6 ఫ్లోర్స్ కన్వెన్షన్ సెంటర్ కి, మిగతా ఫ్లోర్స్ అన్ని హోటల్ సర్వీస్ కి ఉపయోగించనున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలో వస్తున్నాయి. మరి ఈ కథనాల్లో ఎంత నిజం ఉన్నదో తెలియదు.
Salman Khan : నా గర్ల్ ఫ్రెండ్స్ అంతా మంచోళ్ళే.. నేనే తప్పు చేశా..
ఇక టైగర్ 3 విషయానికి వస్తే.. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలు మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ సినిమాల నిర్మాణ సంస్థ ఒక స్పై యూనివర్స్ ని క్రియేట్ చేశారు. ఇటీవల అందులో భాగంగా షారుఖ్ పఠాన్ ని తెరకెక్కించారు. ఇప్పుడు టైగర్ 3 కూడా ఆ యూనివర్స్ లో భాగంగానే తీసుకు వస్తున్నారు. ఈ మూవీలో షారుఖ్ అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ లో ఇటీవల సల్మాన్ కి గాయం అయినట్లు తానే సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.
