Salman Khan Sikandar movie team plans tight security for Rashmika Mandanna
Salman Khan : సల్మాన్ ఖాన్ కి గత కొద్ది రోజులుగా హత్యా బెదిరింపు కాల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సల్మాన్ తన ఇంటి వద్ద టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. అంతే కాదు బుల్లెట్ ప్రూఫ్ కార్ సైతం కొనుగోలు చేశారు. కొద్ది రోజుల నుండి ఇలా జరగడంతో ఆయన ఒప్పుకున్న సికిందర్ సినిమా షూటింగ్ కూడా ఆపేసారు. అయితే సల్మాన్ బిగ్ బాస్ 18కి హోస్టింగ్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ దీని కారణంగా ఇది కూడా మానేశారు.
అయితే ఇటీవల బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ షూటింగ్ కి భారీ బందోబస్త్ మధ్య వెళ్లి వచ్చాడు సల్మాన్. మరో వైపు ఆయన ఒప్పుకున్న సికిందర్ మూవీ షూటింగ్ సైతం స్టార్ట్ చెయ్యనున్నారు. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తున్న నేపధ్యంలో రష్మికకి కూడా భారీ మొత్తంలో సెక్యూరిటీ ఏర్పాటు చేసే పనిలో టీమ్ ఉందని బాలీవుడ్ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం.
Also Read : Sobhita Dhulipala : పెళ్లి పనులు మొదలయ్యాక.. చీరలో శోభిత సూపర్ లుక్స్.. ఫొటోలు చూశారా?
ఇక ఏఆర్ మురుగ దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే సల్మాన్ ఖాన్ పోస్టర్ కూడా ఒకటి విడుదల అయ్యింది. మరి అంత భారీ బందోబస్తు మధ్య సికిందర్ షూటింగ్ ఎంతవరకు చేస్తారో చూడాలి. రష్మిక సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ మూవీపై భారీ హైప్ ఉంది.