Prabhas : ప్రభాస్ పుట్టిన రోజు.. కృష్ణంరాజు విగ్రహం వైరల్.. ప్రభాస్ పెద్దమ్మను కలిసిన హీరోయిన్..

Prabhas Birthday King Krishnam Raju statue video goes viral
Prabhas : ఈ రోజు రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే. ఇక ఈ సందర్భంగా డార్లింగ్ పుట్టినరోజు వేడుకలను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తున్నారు ఫాన్స్. నిన్న సాయంత్రం నుండే ప్రభాస్ ఇంటి వద్ద హడావిడి మొదలుపెట్టారు. మరోవైపు టాలీవుడ్ సినీ సెలబ్రిటీస్ సైతం సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. అలాగే తను కమిట్ అయిన సినిమాల నుండి వరుస అప్డేట్స్ కూడా విడుదల చేస్తున్నారు.
అయితే తాజాగా పొట్టేల్ మూవీ టీమ్ కూడా డార్లింగ్ కి విషెస్ తెలిపారు. పొట్టేల్ టీమ్ స్వయంగా డార్లింగ్ ఇంటికి వెళ్లి మరీ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇక ఆ వీడియోలో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవితో అనన్య నాగళ్ళ మాట్లాడుతూ..ఈ నెల 25న పొట్టేల్ రిలీజ్ అవుతుందని తెలిపారు. దానికి శ్యామలా దేవి సపోర్ట్ చేస్తూ కచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని, దీంతో పొట్టెల్ కూడా హీరో అయిపోతుందని అన్నారు.
Also Read : Gangavva : గంగవ్వపై కేసు నమోదు.. బిగ్ బాస్ లోఉంటుందా? వచ్చేస్తుందా?
ఇక ఈ వీడియోలో గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ వీడియో బ్యాగ్రౌండ్ లో కృష్ణం రాజు గారి విగ్రహం ఉంది. ఇక అది చూస్తుంటే నిజంగానే అక్కడ మనిషే ఉన్నాడేమో అనేలా ఆ విగ్రహం ఉంది. దీంతో ఈ వీడియో చూసినవారంతా డార్లింగ్ పుట్టిన రోజు నాడు ఇలా అయన విగ్రహం కనిపించడం చాలా సంతోషంగా ఉందని, ప్రభాస్ కి అయన దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని కామెంట్స్ పెడుతున్నారు.