Gangavva : గంగవ్వపై కేసు నమోదు.. బిగ్ బాస్ లో ఉంటుందా? వచ్చేస్తుందా?

తాజాగా గంగవ్వ పై కేసు నమోదు అయింది.

Gangavva : గంగవ్వపై కేసు నమోదు.. బిగ్ బాస్ లో ఉంటుందా? వచ్చేస్తుందా?

Case Filed on Gangavva in Forest Department Gangavva out from Bigg Boss Rumours goes Viral

Updated On : October 23, 2024 / 5:24 PM IST

Gangavva : మై విలేజ్ షో ఛానల్ లో యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయిన గంగవ్వ ఆ తర్వాత యూట్యూబ్ తో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీ అయింది. గతంలో ఓ సారి బిగ్ బాస్ కి వెళ్లిన గంగవ్వ ఈ సారి కూడా బిగ్ బాస్ కి వెళ్ళింది. ప్రస్తుతం గంగవ్వ బిగ్ బాస్ లోనే ఉంది. అయితే తాజాగా గంగవ్వ పై కేసు నమోదు అయింది.

మే 20,2022 రోజున యూట్యూబ్ ఛానల్ లో గంగవ్వ చిలుక పంచాంగంకు సంబంధించిన ఓ వీడియోను అప్లోడ్ చేసిందని, గంగవ్వ, రాజు యూట్యూబ్ ప్రయోజనాల కోసం చిలకను ఉపయోగించి హింసించి వన్యప్రాణుల రక్షణ చట్టం ఉల్లంఘించారని, వినోదం కోసం చిలుకని ఉపయోగించడం చట్టం‌ ఉల్లంఘన క్రిందకి వస్తుందని గౌతమ్ అనే అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసాడు. దీంతో జగిత్యాల‌ అటవీశాఖ అధికారులు గంగవ్వతో పాటు యూట్యూబర్ రాజుపై కూడా కేసు నమోదు చేసారు.

Also Read : Aishwarya Rai : విడాకుల రూమర్స్.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఐశ్వర్య రాయ్ ఫొటోస్ వైరల్..

అయితే నిన్న గంగవ్వకు బిగ్ బాస్ లో హార్ట్ అటాక్ వచ్చింది, వెంటనే డాక్టర్ ని తీసుకెళ్లి చికిత్స చేసారు అని వార్తలు వచ్చాయి. దీనిపై ఇప్పటిదాకా బిగ్ బాస్ టీమ్ క్లారిటీ ఇవ్వలేదు. ఇటు ఈ వార్తలు, మరో వైపు కేసుతో గంగవ్వ హౌస్ లో ఉంటుందా బయటకు వస్తుందా అని ఆమె అభిమానులు, బిగ్ బాస్ ఆడియన్స్ చర్చిస్తున్నారు.