Salman Khan : సల్మాన్ ఖాన్ పెట్టుకునే బ్రాస్లెట్ వెనక కథ తెలుసా?

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేతికి ఉండే బ్రాస్లెట్‌ని అభిమానులు ఆసక్తిగా చూస్తుంటారు. దానిని ధరించడం వెనుక స్టోరీ ఏముందా? అనే క్యూరియాసిటీ కూడా చాలామందిలో ఉంటుంది. రీసెంట్‌గా ఆయనకి సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆయన ఆ బ్రాస్లెట్ గురించిన సీక్రెట్ రివీల్ చేశారు.

Salman Khan

Salman Khan : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేతికి పెట్టుకునే బ్రాస్లెట్ కథ అంటూ ఓ పాత వీడియో వైరల్ అవుతోంది. ఓ ఈవెంట్‌లో సల్మాన్ ఫ్యాన్ బ్రాస్లెట్ సీక్రెట్ ఏంటని అభిమాని అడుగుతుంటే ఆయన చెప్పడం ఈ వీడియోలో కనిపిస్తుంది.

Salman Khan : ఇక తన లైఫ్‌లో పెళ్లి చాప్టర్ లేదని చెప్పేసిన సల్మాన్.. వీడియో వైరల్!

సల్మాన్ ఖాన్ సిగ్నేచర్ బ్రాస్లెట్ ఆయన ఫ్యాన్స్‌ని ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. దాని వెనుక ఏదైనా సీక్రెట్ ఉందేమో తెలుసుకోవాలి అనిపిస్తుంది. అలా తెలుసుకోవాలని మీకు అనిపిస్తే ఈ వీడియో మీకు ఆ విషయాన్ని రివీల్ చేస్తుంది. మణిరత్నంతో అమర్చిన బ్రాస్లెట్ సల్మాన్ ఎందుకు ధరించారో ఆయన వీడియోలో చెప్పారు.

 

being__reels అనే ఇన్‌స్ట్రాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో మీరు ధరించే బ్రాస్లెట్ వెనుక కథేంటని అభిమాని అడిగినపుడు తన తండ్రి ఎప్పుడూ ఈ బ్రాస్లెట్ ధరించేవారని.. చిన్నప్పుడు తనకి తెలియని వయసులో దాంతో ఆడుకునేవాడనని.. తను కెరియర్లోకి వచ్చాక ఆ బ్రాస్లెట్ తండ్రి ఇచ్చారని సల్మాన్ చెప్పారు. అందులో ఉండే ప్రత్యేకమైన మణి గురించి చెబుతూ అది ఏదైనా నెగిటివిటీ మన మీదకు వస్తే ఆ రాయి తీసుకుంటుందని వెంటనే అది బ్రేక్ అవుతుందని.. అలా తను ఇప్పటికీ 7 స్టోన్స్ మార్చానని సల్మాన్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.

Salman Khan : 19 అంతస్థుల బిల్డింగ్‌ని.. ఆమె పేరున రిజిస్టర్ చేయించిన సల్మాన్.. నిజమేనా?

సల్మాన్ చెప్పిన విషయం చాలా సింపుల్‌గా క్లుప్తంగా ఉందని..చాలామంది కామెంట్లు చేశారు. ఐదురోజుల క్రితం షేరైన ఈ వీడియో మిలియన్ల సంఖ్యలో దూసుకుపోతోంది.