Salman Khan : మళ్ళీ లవర్ బాయ్‌గా మారబోతున్న సల్మాన్ ఖాన్..? తనకు నాలుగు హిట్లు ఇచ్చిన డైరెక్టర్‌తో..

వరసగా యాక్షన్ మూవీస్ చేస్తున్న సల్మాన్ ఖాన్ ని మరోసారి లవర్ బాయ్ గా చూడాలని ఆశిస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ వినిపిస్తుంది.

Salman Khan turns again as Lover Boy with Sooraj Barjatya Movie Rumours goes Viral

Salman Khan : కొన్ని కాంబినేషన్స్ ఎప్పటికీ ఫరెవర్. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, సూరజ్ బార్జాత్యా కాంబినేషన్ కూడా అలాంటిందే. వీరి కాంబోనేషన్ లో మళ్ళీ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్. దాదాపు సంవత్సరం నుంచి అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ‘ప్రేమ్ కీ షాదీ’ సెట్స్ మీదకు వెళ్తుందా అని సందేహిస్తున్నారు ఫ్యాన్స్.

వరసగా యాక్షన్ మూవీస్ చేస్తున్న సల్మాన్ ఖాన్ ని మరోసారి లవర్ బాయ్ గా చూడాలని ఆశిస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ వినిపిస్తుంది. సల్మాన్ ఖాన్, సూరజ్ బార్జాత్యా కాంబినేషన్లో సినిమా వస్తుందని సంవత్సరం నుంచి వెయిట్ చేస్తన్న ఫాన్స్ వెయిట్ ఈజ్ ఓవర్ అంటూ బాలీవుడ్ లో న్యూస్ వైరల్ అవుతోంది. సల్మాన్, సూరజ్ బార్జాత్యా కాంబినేషన్లో తెరకెక్కాల్సిన ప్రేమ్ కీ షాదీ సెట్స్ మీదకెళ్లే టైమొచ్చేసిందని తెలుస్తోంది.

Also Read : Nani – Keerthy Suresh : నాని కొడుకు కీర్తి సురేష్ ని ఏమని పిలుస్తాడా తెలుసా? నాని కొడుకుపై కీర్తి ఆసక్తికర వ్యాఖ్యలు..

సల్మాన్ ఖాన్, సూరజ్ కాంబినేషన్లో ప్రేమ్ కీ షాదీ సినిమాని నిజానికి ఈ సంవత్సరం స్టార్ట్ చేద్దామనుకున్నారు కానీ ఆల్రెడీ సల్మాన్ సికందర్, బుల్ సినిమాల కమిట్మెంట్స్ ఉండడంతో నెక్ట్స్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయ్యింది ఈ సినిమా. ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ చేసుకుని ఈ క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ప్రేమ్ కీ షాదీ సినిమా నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లోనే సెట్స్ మీదకెళ్లబోతోందని తెలుస్తోంది. దీంతో మళ్ళీ చాన్నాళ్ల తర్వాత సల్మాన్ ఖాన్ ని లవర్ బాయ్ గా చూస్తామని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సల్మాన్ ఖాన్ హీరోగా సూరజ్ బార్జాత్యా డైరెక్షన్లో వచ్చిన 4 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యి ఇండస్ట్రీ లో లవ్ స్టోరీలుగా బెంచ్ మార్క్ సెట్ చేశాయి. సూరజ్ – సల్మాన్ కాంబోలో వచ్చిన మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ కే హైన్ కౌన్, హమ్ సాథ్ సాథ్ హైన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో.. ఈ నాలుగు సినిమాలు సూపర్ హిట్ లవ్ స్టోరీలుగా నిలిచాయి. మరి ఇప్పుడు రాబోయే 5వ సినిమా ప్రేమ్ కీ షాదీ కూడా హిట్ అయి ఈ కాంబో సక్సెస్ ని కంటిన్యూ చేస్తారేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు