Nani – Keerthy Suresh : నాని కొడుకు కీర్తి సురేష్ ని ఏమని పిలుస్తాడో తెలుసా? నాని కొడుకుపై కీర్తి ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని కొడుకు అర్జున్ గురించి కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Nani – Keerthy Suresh : నాని కొడుకు కీర్తి సురేష్ ని ఏమని పిలుస్తాడో తెలుసా? నాని కొడుకుపై కీర్తి ఆసక్తికర వ్యాఖ్యలు..

Keerthy Suresh Interesting Comments on Nani Son Arjun

Updated On : August 1, 2024 / 9:42 AM IST

Nani – Keerthy Suresh : కీర్తి సురేష్, నాని కలిసి నేను లోకల్, దసరా సినిమాలో నటించారు. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే సినిమాల కంటే కూడా వీరిద్దరి మధ్య చాలా మంచి స్నేహం ఉంది. గతంలో కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హైదరాబాద్ కి వస్తే నాని ఇంటికే వెళ్తాను, వాళ్ళ వంటింట్లోకి కూడా వెళ్లి వంట చేసుకుంటాను. నాని ఫ్యామిలీ నాకు అంత క్లోజ్. నాని భార్య అంజనా కూడా చాలా క్లోజ్ అని చెప్పింది.

కీర్తి సురేష్ త్వరలో రఘు తాత అనే సినిమాతో తమిళ్ లో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని కొడుకు అర్జున్ గురించి కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Also Read : Jabardasth Varsha : బాబోయ్.. జబర్దస్త్ వర్ష ఈ రేంజ్ లో డ్యాన్స్ వేస్తుందా.. జూనియర్ సమంత అంటూ కామెంట్స్..

కీర్తి సురేష్ మాట్లాడుతూ.. నాని కొడుకు జున్ను( నాని కొడుకు ముద్దు పేరు) నా స్ట్రెస్ బస్టర్. జున్ను నన్ను కీర్తి అత్త అని పిలుస్తాడు. వాడి క్యూట్ నెస్ చూస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. జున్ను చాలా తొందరగా పెరుగుతున్నాడు. జున్ను పెద్దవాడవడం సంతోషంగా ఉంది. హైదరాబాద్ కి వస్తే కచ్చితంగా జున్నుని కలిసే వెళ్తాను. వాడి వాయిస్ మెసేజెస్ వింటూ ఉంటాను. నాకు బర్త్ డే విషెష్ కూడా క్యూట్ గా చెప్పాడు అని తెలిపి హ్యాపీ బర్త్ డే కిట్టి అత్త అని అర్జున్ చెప్పిన వాయిస్ క్లిప్ ని ఆ ఇంటర్వ్యూలో వినిపించింది. దీంతో నాని ఫ్యామిలీకి కీర్తి సురేష్ తో మంచి సాన్నిహిత్యం ఉందని మరోసారి అర్ధమవుతుంది. ఇక నాని కొడుకు గురించి కీర్తి ఇలా చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.