Salman Khan : హత్య బెదిరింపులను పక్కనపెట్టి.. సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్న సల్మాన్..

Salman Khan will start Sikandar movie shooting after threats

Salman Khan : రాజకీయ నేత, తనకి బాగా క్లోజ్ అయిన బాబా సిద్ధిక్ మర్డర్ తర్వాత సల్మాన్ కి బెదిరింపు కాల్స్ రావడం, ప్రాణహాని ఉందని ఇన్ని రోజులు అన్నిటికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీనికి గాను సల్మాన్ కొంత మంది ప్రభుత్వ సెక్యూరిటీ తో పాటు సొంతంగా కొంత మంది ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకొని ఇంట్లోనే ఉన్నారు.

ఇక బాబా సిద్ధిక్ మర్డర్ తర్వాత మొదటిసారి సల్మాన్ బిగ్ బాస్ షూటింగ్ కు భారీ బందోబస్త్ తో వెళ్లారు. ఈ క్రమంలోనే సికిందర్ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. అయితే తాజాగా బాలీవుడ్ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే సల్మాన్ షూటింగ్ లో జాయిన్ కానున్నారట.

Also Read : Bigg Boss 8 : ప్రేర‌ణ‌-విష్ణు ప్రియ మ‌ధ్య గొడ‌వ‌.. పృథ్వీ రాక్స్‌.. అవినాశ్ షాక్‌..

ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుండి జూన్ లో సల్మాన్ లుక్ ఒకటి రిలీజ్ కావడంతో దీనిపై నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంది. మరి ఇన్ని ఇబ్బందుల మధ్య సల్మాన్ రోజు షూటింగ్ కి వెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.