Bigg Boss 8 : ప్రేరణ-విష్ణు ప్రియ మధ్య గొడవ.. పృథ్వీ రాక్స్.. అవినాశ్ షాక్..
బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల పర్వం వాడీవేడిగా కొనసాగుతోంది.

Bigg Boss Telugu 8 Day 51 Promo 2 Contestants Lose Their Cool
బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల పర్వం వాడీవేడిగా కొనసాగుతోంది. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. దిష్టిబొమ్మలపై కుండలు పెట్టి తగిలిన కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సిందిగా బిగ్‌బాస్ చెప్పాడు. ప్రేరణ, నిఖిల్‌లను విష్ణుప్రియ నామినేట్ చేయగా.. పృథ్వీ, నిఖిల్‌లను రోహిణి నామినేట్ చేసింది. మెహబూబ్, నిఖిల్‌లను నయని పావని నామినేట్ చేసింది. పృథ్వీ వచ్చి రోహిణి, ప్రేరణలపై రివేంజ్ నామినేషన్ చేశాడు. నబీల్ వచ్చి ప్రేరణ, హరితేజలను నామినేట్ చేశాడు.
మంగళవారం కూడా నామినేషన్స్ కొనసాగనున్నాయి. నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోలను విడుదల చేశారు. నిఖిల్‌ను గంగవ్వ నామినేట్ చేసింది. నీ గేమ్ కనిపించడం లేదు. నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కొన్ని పదాలు కఠినంగా ఉంటాయని చెబుతూ విష్ణుప్రియను యష్మీ నామినేట్ చేసింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రేరణ పేరును విష్ణు తీసింది.
దీంతో విష్ణు ప్రియపై ప్రేరణ మండిపడింది. విష్ణు, ప్రేరణలు గొడవ పడుతుండగా ఇది నా నామినేషన్, మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు అని అంటూ యష్మి గట్టిగా అరిచింది. ఆ తరువాత మెహబూబ్‌ను నామినేట్ చేశాడు నిఖిల్. గడ్డం గీయించుకోలేదనే పాయింట్‌పై పృథ్వీని నామినేషన్ చేశాడు అవినాశ్. రూ.50 వేలు ఇచ్చారని తాను గడ్డం తీయను అని చెప్పాడు పృథ్వీ.
అక్కడ లక్ష రూపాయల హెయిర్ స్టైల్ కూడా ఉంది కదా.. మీరెందుకు రూ.50వేల హెయిర్ స్టైల్ చేయించుకున్నారు. మీ హెయిర్ పోకుండా ఉండాలని అనేలా అని పృథ్వీ ప్రశ్నించాడు. అది నా ఇష్టం అని అవినాశ్ అనగా.. మరీ గడ్డం తీయకూడదనేది నా ఇష్టం అంటూ అవినాశ్‌కు కౌంటర్ ఇచ్చాడు పృథ్వీ.
Raja Saab : ప్రభాస్ ‘రాజా సాబ్’ నుంచి హారర్ పోస్టర్ వచ్చేసింది.. రేపే గ్లింప్స్ రిలీజ్