Pooja Hegde: నా టైం అస్సలు బాలేదు.. సక్సెస్ కి దూరం అయ్యాను.. ఇలాంటి సమయంలో.. పూజ హెగ్డే ఎమోషనల్ కామెంట్స్
తన కెరీర్ గురించి తలుచుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసిన స్టార్ బ్యూటీ పూజ హెగ్డే(Pooja Hegde).
Pooja hegde emotional comments about her career
Pooja Hegde: పూజ హెగ్డే.. మొన్నటివరకు స్టార్ బ్యూటీగా ఉంది. కానీ, సడన్ గా ఏమయ్యిందో తెలియదు కానీ, అమ్మడు ఫేమ్ పూర్తిగా తగ్గిపోయింది. మొన్నవరకు స్టార్ హీరోలు వరుసగా ఈ అమ్మడుతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆ ఊసే లేదు. తీసుకున్న సినిమాల నుంచి కూడా ఆమె తొలగిస్తున్నారు. తెలుగులో ఈ అమ్మడు ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
ఆ తరువాత ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్స్ తో సినిమాలు చేసింది. వాటిలో హిట్స్ ఉన్నాయి ప్లాప్స్ కూడా ఉన్నాయి. కానీ, రీసెంట్ పూజ(Pooja Hegde) చేసిన ఒక్క సినిమా కూడా ఆమెకు సరైన విజయాన్ని అందించలేదు. దీంతో, ఆమెకు అవకాశాలు చాలా వరకు తగ్గాయి. ప్రస్తుతం పూజ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయడం లేదు. ఇక ఆమె నటించిన తమిళ సినిమా జన నాయగన్ సినిమా కూడా అనుకోని కారణాల వల్ల ఆగిపోవాల్సి వచ్చింది.
Vijay- Rashmika: రష్మిక మమ్మల్ని పిలవదు.. రష్మిక పెళ్లిపై రక్షిత్ శెట్టి ఫ్రెండ్ హాట్ కామెంట్స్
ప్రస్తుతం ఈ అమ్మడు తన కెరీర్ లో టఫ్ టైంను ఎదుర్కుంటోంది. ఈ నేపధ్యంలోనే తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న పూజ హెగ్డే తన కెరీర్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఈ పాడ్ కాస్ట్ లో ఆమె మాట్లాడుతూ.. ప్రెజెంట్ నా టైం అస్సలు బాగోలేదు. చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతూ వస్తున్నాయి. కొన్నాళ్లుగా నా లైఫ్ నుంచి సక్సెస్ అనే మాట దూరం అయ్యింది. అందుకే, నా లైఫ్ లో ఇది నాకు చాలా ప్రత్యేకమైన సమయం. ఇకనుంచి నేను చేసే సినిమాలు నాలోని నటిని మీకు పరిచయం చేస్తాయి.
సినిమా బ్యాక్డ్రౌండ్ లేని నాలాంటి అమ్మాయిలు ఇండస్ట్రీలో కొనసాగడం చాలా కష్టం. కానీ, నేను ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నిలబడతాను” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. దీంతో పూజ హెగ్డే చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్స్ ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రతీ ఒక్కరి లైఫ్ లో ఈ ఫేస్ కామన్ అని, ధైద్యంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇకనుంచైనా పూజ హెగ్డేకు మంచి సినిమా అవకాశాలు వస్తాయా అనేది చూడాలి.
