Singham Again : ‘సింగం ఎగైన్’ లో స‌ల్మాన్ ఎంట్రీ కూడా.. రోహిత్ శెట్టి కాప్‌ యూనివ‌ర్స్‌.. మొత్తం ఎంత మంది స్టార్స్ అంటే?

రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో అజయ్ దేవగన్ హీరోగా న‌టిస్తున్న చిత్రం సింగం ఎగైన్‌.

Singham Again : ‘సింగం ఎగైన్’ లో స‌ల్మాన్ ఎంట్రీ కూడా.. రోహిత్ శెట్టి కాప్‌ యూనివ‌ర్స్‌.. మొత్తం ఎంత మంది స్టార్స్ అంటే?

Salman Khan joins forces with Ajay Devgn in Rohit Shetty’s Singham Again

Updated On : October 22, 2024 / 5:09 PM IST

రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో అజయ్ దేవగన్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘సింగం ఎగైన్‌’. సింగం సిరీస్‌లో వ‌స్తున్న మూడో సినిమా ఇది. ఈ చిత్రం పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఫ్యాన్స్ అంచ‌నాల‌ను మించి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోంది చిత్ర బృందం. దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 1న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే చిత్ర బృందం ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా విశేష స్పంద‌న వచ్చింది.

కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కూడా అతిథి పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇన్‌స్పెక్ట‌ర్ చుల్‌బుల్ పాండేలా స‌ల్మాన్ క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రోహిత్ శెట్టి తాను తీసిన పోలీస్ సినిమాలన్నిటిని లింక్ చేస్తూ కాప్ యూనివర్స్ సృష్టించి సింగం ఎగైన్‌ను తెర‌కెక్కిస్తున్నారు. అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, దీపికా పదుకోన్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్, కరీనా కపూర్ లు ఇప్ప‌టికే ట్రైల‌ర్‌లో క‌నిపించారు.

Raja Saab : ప్ర‌భాస్ ‘రాజా సాబ్’ నుంచి హార‌ర్ పోస్ట‌ర్ వ‌చ్చేసింది.. రేపే గ్లింప్స్ రిలీజ్‌

అయితే.. స‌ల్మాన్ ఖాన్‌ను మాత్రం చూపించ‌లేదు. డైరెక్ట్‌గా తెర‌పై చూపించి ఆడియ‌న్స్ స‌ర్‌ప్రైజ్ చేయాల‌ని రోహిత్ శెట్టి భావిస్తున్నాడ‌ట‌. అందుక‌నే స‌ల్మాన్‌ను చూపించ‌లేద‌ని అంటున్నారు. మొత్తం 8 మందికి పైగా స్టార్స్ సింగం ఎగైన్ మూవీలో క‌నిపించ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల స‌ల్మాన్ ఖాన్‌ను బెదిరింపులు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న భ‌ద్ర‌త‌ను పెంచారు. బెదిరింపుల నేప‌థ్యంలో ఆయ‌న ఈ మూవీలో న‌టించ‌క‌పోవ‌చ్చు అనే వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. రోహిత్ శెట్టి, అజయ్ దేవ‌గ‌న్‌తో ఉన్న స్నేహం కార‌ణంగా స‌ల్మాన్ ఈ మూవీలో న‌టించేందుకే మొగ్గు చూపార‌ట‌. ఈ విష‌యం తెలిసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

Naga Manikanta : బిగ్ బాస్ తర్వాత మణికంఠ తన భార్యతో కలిసాడా లేదా.. ఏమన్నాడంటే?