Operation Kagar : ‘ఆపరేషన్ కగార్’లో కీలక పరిణామం.. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ..
Operation Kagar : మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Operation Kagar
- ‘ఆపరేషన్ కగార్’లో కీలక పరిణామం
- మావోయిస్టుపార్టీకి భారీ ఎదురుదెబ్బ
- ఎస్ఐబీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు
- దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిసహా 16మంది లొంగుబాటు
Operation Kagar : మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ఎస్ఐబీ ఎదుట మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిసహా 16మంది లొంగిపోయారు. ఆదివారం ఆసిఫాబాద్ అడవుల్లో తెలంగాణ ఎస్ఐబీ ఎదుట వీరంతా లొంగిపోయారు. దేవ్ జీ కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీగా, రాజిరెడ్డి మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. రెండ్రోజుల్లో లొంగిపోయిన మావోయిస్టులను పోలీసులు మీడియా ఎదుట హాజరుపర్చనున్నారు. మార్చి 31 నాటికి నక్సలిజం అంతం లక్ష్యంగా కేంద్రం చర్యలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేవ్, రాజిరెడ్డి టార్గెట్ గా ఆపరేషన్ కగార్-2 నిర్వహించింది.
Also Read : Pakistan : అఫ్గానిస్థాన్‌పై పాక్ బాంబుల వర్షం.. మరోసారి ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం
మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరిట ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టుల నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రత బలగాలు జల్లెడ పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ – ఛత్తీస్గడ్ అటవీ ప్రాంతాల్లో భద్రతాబలగాలు కూంబింగ్ నిర్వహించగా.. పలుసార్లు మావోయిస్టులకు, జవాన్లకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు.
ఆపరేషన్ కగార్‌లో భాగంగా భద్రతా బలగాలు మావోయిస్టు అగ్ర నేతలను టార్గెట్ గా చేసుకున్నాయి. వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే పలువురు మావోయిస్టు అగ్రనేతలు భద్రతా బలగాల కాల్పుల్లో మరణించగా.. మరికొందరు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. మరికొందరు మావోయిస్టు అగ్రనేతల కోసం భద్రతాబలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలోకి మావోయిస్టుల అగ్రనేతలు దేవ్ జీతోపాటు పలువురు నేతలు ప్రవేశించారని నిఘా వర్గాల నుంచి కేంద్ర భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో కర్రెగుట్టలో ఇటీవల జరిగిన భారీ ఎన్ కౌంటర్లో పలువురు మావోయిస్టులు మరణించారు. వీరిలో అగ్రనేతలు ఉన్నారంటూ చర్చ జరిగింది. దేవ్ జీ లక్ష్యంగా కర్రెగుట్టల్లో కూబింగ్ నిర్వహించారంటూ ఈ ఎన్కౌంటర్ సమయంలో ప్రచారం జరిగింది. అయితే, తాజాగా.. దేవ్ జీ, మల్లా రాజిరెడ్డితోపాటు 16మంది మావోయిస్టుల ఎస్ఐబీ ఎదుట లొంగిపోయారు.
