Panchayat Funds : డబ్బులొచ్చేస్తున్నాయ్.. 10రోజుల్లో ఖాతాల్లోకి డబ్బులు.. లేట్ చేస్తే వడ్డీతో సహా.. స్పష్టం చేసిన కేంద్రం..
Panchayat Funds : గ్రామ పంచాయతీలకు శుభవార్త.. పది రోజుల్లో గ్రామ పంచాయతీ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. రాష్ట్రానికి విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను 10రోజుల్లోగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
CM Revanth Reddy
- 10 రోజుల్లోగా పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ చేయాలి
- రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన కేంద్రం
- 15వ ఆర్థిక సంఘం నిధులపై పంచాయతీరాజ్ శాఖ గైడ్‌లైన్స్
Panchayat Funds : గ్రామ పంచాయతీలకు శుభవార్త.. పది రోజుల్లో గ్రామ పంచాయతీ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. రాష్ట్రానికి విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను 10రోజుల్లోగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆలస్యమైతే ఆ నిధులను వడ్డీతో సహా లోకల్ బాడీలకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది.
Also Read : మరి ఆ డబ్బు సంగతేంటి? ట్రంప్ ఇన్నాళ్లూ వసూలు చేసిన రూ.15 లక్షల కోట్లు తిరిగి వస్తాయా?
కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటికే మూడు విడతల్లో రూ. 1,034.42 కోట్ల నిధులు విడుదలయ్యాయి. మొదటి విడతలో రూ. 323.44 కోట్లు, రెండో విడతలో రూ.323.45 కోట్లు, మూడో విడతలో 387.53 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇంకా రాష్ట్రానికి సుమారు రూ.2వేల కోట్లు రావాల్సి ఉంది. ఈ మొత్తం రావాలంటే ఇప్పటికే వచ్చిన నిధుల వినియోగంకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లను (UCs) సమర్పించాలని కేంద్రం పేర్కొంది. యుటిలైజేషన్ సర్టిఫికెట్లను పంపించి, ఆడిట్ చేస్తేనే మిగిలిన రూ.2వేల కోట్ల బకాయిలు చెల్లించే చాన్స్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
2011 జనాభా లెక్కల ఆధారంగా ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. నిధుల పంపిణీలో ఎక్కువ మొత్తం గ్రామ పంచాయతీలకే కేటాయిస్తున్నారు. మొత్తం నిధుల్లో జీపీలకు 85శాతం, మండల పరిషత్ లకు 10శాతం, జిల్లా పరిషత్‌లకు 5శాతం చొప్పున ఇస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి విడుదలైన నిధులను 10రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కోతలు లేకుండా సంబంధిత గ్రామ, మండల, జిల్లా పరిషత్ ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేయాలి.
మరోవైపు.. ఈ నిధుల వినియోగంపై పంచాయతీరాజ్ శాఖ కూడా తాజాగా గైడ్‌లైన్స్ ఇచ్చింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇంటర్నల్ రోడ్ల మరమ్మతులు, తదితర మౌలిక వసతులకే ఈ నిధులను వినియోగించాలని పంచాయతీరాజ్ శాఖ తాజా గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేసింది.
