తెలుగు పాటల్లో ‘సామజనవరగమన’ సరికొత్త రికార్డ్

  • Publish Date - October 19, 2019 / 10:52 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అల వైకుంఠపురములో’… గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్‌పై, అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కలిసి నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్  ‘సామజవరగమన’ పాట విశేషంగా ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిందీ సాంగ్.. థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రాశారు. యంగ్ సెన్సేషన్ సిడ్ శ్రీరామ్ చాలా బాగా పాడాడు.

‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు.. ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు.. సామజవరగమన.. నినుచూసి ఆగగలనా… మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా’.. అంటూ సాగే ఈ బ్యూటీఫుల్ మెలోడీ అక్షరాలా 40 మిలియన్స్‌కు పైగా వ్యూస్, 7 లక్షలకు పైగా లైక్స్ తెచ్చుకుని, మోస్ట్ లైక్డ్ తెలుగు సాంగ్‌గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా బన్నీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌కు థ్యాంక్స్ చెప్పాడు. ఎక్కువ ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా.. వయొలిన్, పియానో, గిటార్, డ్రమ్స్, బేస్ గిటార్ వంటి వాయిద్యాలతో .. 70 మంది ఆర్కెస్ట్రా, 35 పీస్ బ్యాండ్‌తో ఈ సాంగ్ కంపోజ్ చేశారు..

Read Also : ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ప్రారంభం

పూజా హెగ్డే, నివేధా పేతురాజ్ హీరోయిన్స్ కాగా.. టబు, సుశాంత్, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సునీల్, నవదీప్, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న ‘అల వైకుంఠపురములో’… రిలీజ్ కానుంది.  కెమెరా : పి.ఎస్. వినోద్, ఎడిటింగ్ : నవీన్ నూలి, సంగీతం : థమన్ ఎస్, ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్ : రామ్ – లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పిడివి ప్రసాద్.