Samantha: సామ్ బాలీవుడ్ ప్లాన్స్.. త్వరలోనే గుడ్ న్యూస్!
అభిమానులు ఎంతగా నొచ్చుకున్నా.. చూడముచ్చటైన జంట ఇలా అయిపోతుందని అనుకోలేదని ఎవరు ఎంత బాధపడినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అక్కినేని నాగ చైతన్య - సమంతా విడిపోయారు. ఎవరికి వారు..
- Naresh Mannam
- Published On : October 13, 2021 / 12:39 PM IST
Samantha
Samantha: అభిమానులు ఎంతగా నొచ్చుకున్నా.. చూడముచ్చటైన జంట ఇలా అయిపోతుందని అనుకోలేదని ఎవరు ఎంత బాధపడినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అక్కినేని నాగ చైతన్య – సమంతా విడిపోయారు. ఎవరికి వారు కెరీర్ పైన దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందులో ఎవరిది తప్పని కొందరు విశ్లేషణలు చేసి సమంతాను తప్పుబట్టినా సామ్ అన్నిటికి ఓపికగా సోషల్ మీడియా వేదికగా సమాధానం చెప్తుంది.
Naga Chaitanya: కొత్తగా అపార్ట్‌మెంట్ కొన్న చైతూ.. అందులోనే ఒంటరిగా?
మరోవైపు మళ్ళీ కెరీర్ మీద ఫోకస్ చేసిన సామ్ ఇప్పుడు కొత్త ప్రాజెక్టులను ఒకే చేసిన పనిలో పడింది. పెళ్లి తర్వాత మ్యారీడ్ లైఫ్ కోసం కొంతమేర ఆచితూచి ఎంచుకున్న సామ్.. పర్సనల్ లైఫ్ కోసం కొన్ని క్రేజీ ఆఫర్లను కూడా వద్దనుకుంది. కానీ, ఇప్పుడు మళ్ళీ కొత్త కథలను వింటుంది. బాలీవుడ్ లో ఫ్యామిలీ మాన్ 2 తర్వాత సామ్ కి అక్కడ భారీ ఆఫర్లు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది.
Naga Chaitanya-Samantha: బంధం బ్రేకప్.. సామ్-చై మధ్య ఎక్కడ చెడింది?
మరోవైపు తెలుగులో శాకుంతలం పూర్తిచేసిన సమంతా ప్రస్తుతం తమిళ సినిమాతో బిజీగా ఉంది. ఇక కొత్తగా మరో మూడు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇందులో ఒకటి బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ కాగా త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో భారీ ఆఫర్లు వస్తాయని భావిస్తున్న సామ్.. దక్షిణాది సినిమాలను కూడా వదిలే ఉద్దేశ్యంలో లేదని చెప్తున్నారు. సాధ్యమైనంత త్వరగా కొత్త సినిమాలు స్టార్ట్ చేసి డైవర్స్ డిప్రెషన్ నుండి బయటపడాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.
