Samantha : సమంతని ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్‌తో మళ్ళీ సినిమా.. సెకండ్ ఇన్నింగ్స్‌కి బ్రేక్ ఇస్తాడా..?
తాజాగా సమంతా ఓ మలయాళం సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం.
- Saketh U
- Published On : July 11, 2024 / 09:46 AM IST
Samantha Doing a Movie in Malayalam with her first Director Gautham Vasudev Menon Rumours Goes Viral
Samantha – Gautham Vasudev Menon : సమంత ఇటీవల మయోసైటిస్ తో బాధపడుతుందని కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓ పక్క సమంత మాయోసైటిస్ కి చికిత్స తీసుకుంటూనే మరో పక్క సినిమాలు మొదలుపెట్టడానికి రెడీ అవుతుంది. సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. సమంత చేతిలో ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్, బంగారం సినిమాలు ఉన్నాయి.
తెలుగులో అయితే సమంతకి ఎవరూ సినిమాలు ఆఫర్ చేసినట్టు టాక్ కూడా వినిపించట్లేదు. బాలీవుడ్ లో మాత్రం సమంతకి ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుంది. పుష్పలో ఐటెం సాంగ్ చేసిన సమంత పుష్ప 2లో కూడా ఉంటుంది అనుకున్నారు కానీ అందులో కూడా ఉండదని తెలుస్తుంది. సమంతకి సినిమా, సిరీస్ ఆఫర్లు వచ్చినా సెలెక్టివ్ గా వెళ్తుందని టాక్.
తాజాగా సమంతా ఓ మలయాళం సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. సమంతని సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. సమంత, నాగచైతన్య జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చినా ఏ మాయ చేసావే సినిమాతోనే సమంత సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత మళ్ళీ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాలో తెలుగు, తమిళ్ వర్షన్ లో నటించింది. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత నటించబోతుందని సమాచారం.
గౌతమ్ మీనన్ కెరీర్ లో మొదటిసారిగా దర్శకుడిగా ఓ మలయాళ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మమ్ముట్టి హీరోగా నటిస్తుండగా సమంత ఓ కీలక పాత్రలో నటిస్తుందట. సమంతకి కెరీర్లో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడు ఈ మలయాళ సినిమాతో సమంతకి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ బ్రేక్ ఇస్తాడా చూడాలి.
